GOD: వేమన జయంత్యుత్సవాలకు ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:23 PM
మండలపరిధిలోని కటారుపల్లిలో ఈ నెల 19న నిర్వహించే వేమన జయంతి ఉత్సవాల కు కావల్సిన ఏర్పాట్లను శనివారం ప్రారంభించారు. యోగివేమన ఉత్సవాలను కటారుపల్లిలో అధికారికంగా జరపాలని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ కోరగా ప్రభుత్వం అందుకు స్పందించింది.
గాండ్లపెంట, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని కటారుపల్లిలో ఈ నెల 19న నిర్వహించే వేమన జయంతి ఉత్సవాల కు కావల్సిన ఏర్పాట్లను శనివారం ప్రారంభించారు. యోగివేమన ఉత్సవాలను కటారుపల్లిలో అధికారికంగా జరపాలని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ కోరగా ప్రభుత్వం అందుకు స్పందించింది. దీంతో ఈ నెల 19న యోగివేమన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అఽధికారులకు, మండల నాయకులకు వేమన పూజారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ వేడుకల్లో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లులో భాగంగా ఆలయ పరిసరాలలోని ముళ్ల కంపలు, రాళ్లను ఎక్స్‌కవేటర్‌తో తొలగిస్తున్నారు. జయంతి వేడుకలకు ఆలయ ప్రాంగణలంలో పలు రకాల పనులు చేపడు తున్నట్లు టీడీపీ మండల కన్వీనర్ బుర్రు వెంకటప్రసాద్ తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....