MLA: వేమన జయంతి ఉత్సవ ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:22 PM
మండలపరిధిలోని కటారు పల్లిలో ఈ నెల 19న నిర్వహించే యోగివేమన జయంతి ఉత్సవాల ఏ ర్పాట్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఎమ్మెల్యే కందికుంట అభ్యర్థనకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం యోగి వేమన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు అనుమ తి ఇచ్చింది.
- పరిశీలించిన ఎమ్మెల్యే కందికుంట
గాండ్లపెంట, జనవరి 14(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని కటారు పల్లిలో ఈ నెల 19న నిర్వహించే యోగివేమన జయంతి ఉత్సవాల ఏ ర్పాట్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఎమ్మెల్యే కందికుంట అభ్యర్థనకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం యోగి వేమన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు అనుమ తి ఇచ్చింది. దీంతో కటారుపల్లిలోని యోగి వేమన ఆలయానికి రంగులు వేయడం తదితర పనులు జరుగుతున్నాయి. అలాగే ఉత్సవాలకు హాజర య్యే భక్తుల సౌకర్యార్థం వసతిగృహాలు, మరుగుదొడ్ల మరమ్మతులు, వివిధ ఏర్పాట్లు, అభివృధ్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటిని పరిశీలించిన ఎమ్మెల్యే త్వరితగతిన పూర్తి చేయాలని అఽధికారులను ఆదేశించారు. అనంతరం సంక్రాంతి పర్విదిన సందర్భంగా యోగివేమన సమాధిని దర్శించుకున్నారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కదిరి మున్సిపల్ కమిష నర్ కిరణ్ కుమార్, తహసీల్దార్ బాబురావు, ఎంపీడీఓ రామకృష్ణ, టీడీపీ మండల కన్వీనర్ బుర్రు వెంకటప్రసాద్, వేమన పీఠాధిపతి నందవేమారెడ్డి, దాసిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, తుంగ వేణుగోపాల్‌రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....