MLA: వేమన జయంతిని సమష్టిగా నిర్వహిద్దాం : ఎమ్మెల్యే
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:04 AM
మండలపరిధిలోని కటారు పల్లిలో ఈ నెల 19న యోగివేమన జయంతి ఉత్సవాలను అధికారు లు, గ్రామ పెద్దలు కలిసి ఘనంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సూచించారు. కటారుపల్లిలో చేపట్టిన యోగి వేమన జయంతి ఉత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు.
గాండ్లపెంట, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని కటారు పల్లిలో ఈ నెల 19న యోగివేమన జయంతి ఉత్సవాలను అధికారు లు, గ్రామ పెద్దలు కలిసి ఘనంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సూచించారు. కటారుపల్లిలో చేపట్టిన యోగి వేమన జయంతి ఉత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు. అనంతరం గ్రామస్థులు, అధికారులతో మాట్లాడుతూ... యోగివేమన ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అందరూ సమష్టిగా ముందుకువచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాబురావు, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీపీ సోమశేఖర్‌రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ బుర్రు వెంకటప్రసాద్, దాసిరెడ్డి సంజీవరెడ్డి, తుంగ వేణుగోపాల్‌రెడ్డి, నరసింహులు, పీఠాధిపతి నందవేమారెడ్డి, నరసింహులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....