MLA: వడ్డెర్లందరూ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:14 AM
పట్టణంలో వడ్డె ఓబన్న జయం తి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళి అ ర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సమాజంలో అన్నివర్గాల ప్రజలకు మంచిచేయాలనే ధోరణిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు.
ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
కదిరి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): పట్టణంలో వడ్డె ఓబన్న జయం తి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళి అ ర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సమాజంలో అన్నివర్గాల ప్రజలకు మంచిచేయాలనే ధోరణిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. జగన్మోహనరెడ్డికి ప్రతిపక్ష హోదా పోయినప్పటికి విద్వేషాలు, ఆరాచ కాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వడ్డెర కులస్థులందరు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఆరాచక శక్తి జగనమ్మోహనరెడ్డిని తరమికొట్టాలని పిలుపునిచ్చారు. వడ్డెలందరూ ఏకమై కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, వడ్డెర్ల సంఘం నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....