Home » Kadiri
దసరా ఉత్సవాలతో పాటు సెలవులు కావడంతో పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక నుంచి భక్తులు శుక్రవారం రాత్రే ఆల యానికి చేరుకున్నారు.
ఇంటి పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రతి ఇంటి వద్ద ఓ మొక్కను నాటుకోవాలని జిల్లా పరిషత డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య సూచించారు. అలాచేస్తే మన ఆరోగ్యం మ న చేతుల్లోనే ఉంటుందన్నారు. మండల కేం ద్రంలో గురువారం నిర్వహించిన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమానికి ఆయన ముఖ్య అ తిథిగా హాజరె మాట్లాడారు .
మండలంలోని మార్పురివాం డ్లపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ భాగంలో ఉన్న వంకలు, వాగులు, కుంటలు, పొంగిపోర్లాయి. దీంతో ఎగువ కుంటవద్ద రైతు రవి ఎకరం పొలంలో సాగుచేసిన టమోటా పంట మొత్తం నీటిలో కొట్టుకు పోయింది. దీంతో రూ.లక్ష నష్టం జరిగినట్లు బాధిత రైతు రవి తెలిపారు.
సేంద్రియ ఎరువుల ను పక్కరాష్ట్రాలకు విక్రయించకుండా, పొలాలకు వినియోగించుకోవాలని రైతులకు ఏడీఏ సనావుల్లా సూచించారు. మండలపరిధిలోని వెలిచెల మల, పడమర నడింపల్లిల్లో మంగళవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏడీఏ మాట్లాడుతూ... సేంద్రియ ఎరువకులతో తక్కువ పెట్టుబడితో నాణ్య మైన పంటలు పండించవచ్చని తెలిపారు.
మండలకేంద్రంలో నిత్యం వి ద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని, ఆ శాఖ అధికారు లు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. గృహాలకు అంది స్తున్న విద్యుత సరఫరాలో నిత్యం అంతరాయం ఏర్పడు తోందని వాపోతు న్నారు. రాత్రింబవళ్లు పలుమార్లు విద్యుత పోతూ వస్తోందంటున్నారు.
మండలంలోని బొం తపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు వంకలు, వాగులు, చెరువులు, కుంటలు పొంగిపోర్లాయి. బొంతలపల్లికి చెందిన రామిరెడ్డి మూ డున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగుచేశారు. పంట సాగు చేయడానికి రూ.50వేలుకు పైగా ఖర్చు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో భారీగా కురిసిన వర్షాలకు పూర్తిగా నీటిలో మునిగి పోయింది.
ప్రస్తుతం సీజనలో జ్వరాలు ప్రబలుతున్నాయని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీఎంహెచఓ ఫైరోజ్ బేగం పేర్కొన్నారు. ఆమె గురువారం పట్టణంలోని నాలుగు అర్బన హెల్త్ సెంటర్లతో పాటు నల్లచెరువు మండలంలోని ఎం. అగ్రహా రంలో పర్యటించారు. ఎం. అగ్రహారం ప్రాథమిక కేంద్రంలో మహిళ ఆ రోగ్యం, కుటుంబ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన డైరెక్టర్ ఫర్వీన బాను పేర్కొన్నారు. పట్టణంలోని ఐదో వార్డులో ఉన్న మున్సిపల్ పార్కులో గురువారం చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిం చారు.
మండలపరిధిలోని జాతీయ రహదారికి అనుకుని ఉన్న దేవరింటిపల్లి బస్‌షెల్టర్ ప్రాంతలో అపరిశు భ్రత నెలకొంది. బస్టాప్ చుట్లూ పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు ఏపుగా పెరిగి పోయింది. ఆ ప్రాంతం చెత్తచె దారంతో నిండిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి మండలంలోని ప్రసిద్ధి చెందిన పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి దేవస్థానానికి వెళ్లే భక్తులు ఈ బస్టాప్ వద్దే దిగుతారు.
పట్టణంలోని తహసీల్దార్ కార్యాల యం వద్ద వాహనాలు నిలపకుండా రెవెన్యూ అధికారులు తీసిన గుంతల తో దివ్యాంగుల ఉపాధికి ఆటకం ఏర్పడింది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట పలువురు దివ్యాంగులు ఆర్జీలను పూర్తిచేసి, లబ్ధిదారులకు అంది స్తుంటారు. దానితో వచ్చే ఆదాయం వచ్చేది. గుంతలు తీయడం వల్ల ది వ్యాంగులు కూర్చోవడానికి అవకాశం లేకుండాపోయింది.