TDP: పరావరణాన్ని పరిరక్షించాలి : ఫర్వీనబాను
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:47 PM
పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన డైరెక్టర్ ఫర్వీన బాను పేర్కొన్నారు. పట్టణంలోని ఐదో వార్డులో ఉన్న మున్సిపల్ పార్కులో గురువారం చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిం చారు.
కదిరి, సెప్టెంబరు18 (ఆంధ్రజ్యోతి) : పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన డైరెక్టర్ ఫర్వీన బాను పేర్కొన్నారు. పట్టణంలోని ఐదో వార్డులో ఉన్న మున్సిపల్ పార్కులో గురువారం చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. స్థానికులతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ చైర్‌పర్సన దిల్షాదున్నీషా, వైస్ చైర్మన రాజశేఖరాచారి, టీడీపీ నాయకులు కేఎస్ బాహుద్దీన, శిరి బాబాయ్య, బండారు మురళి, ఓం ప్రకాష్, నాస్పిర్, టీడీపీ ఐదో వార్డు ఇనచార్జ్ ఇమ్రాన, కౌన్సిలర్లు కిన్నెర కళ్యాణ్, మహబూబ్‌బాషా, పలువురు మహిళలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....