BUS: బస్ షెల్టర్‌ను కప్పేసిన ముళ్ల పొదలు
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:40 PM
మండలపరిధిలోని జాతీయ రహదారికి అనుకుని ఉన్న దేవరింటిపల్లి బస్‌షెల్టర్ ప్రాంతలో అపరిశు భ్రత నెలకొంది. బస్టాప్ చుట్లూ పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు ఏపుగా పెరిగి పోయింది. ఆ ప్రాంతం చెత్తచె దారంతో నిండిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి మండలంలోని ప్రసిద్ధి చెందిన పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి దేవస్థానానికి వెళ్లే భక్తులు ఈ బస్టాప్ వద్దే దిగుతారు.
నల్లచెరువు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని జాతీయ రహదారికి అనుకుని ఉన్న దేవరింటిపల్లి బస్‌షెల్టర్ ప్రాంతలో అపరిశు భ్రత నెలకొంది. బస్టాప్ చుట్లూ పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు ఏపుగా పెరిగి పోయింది. ఆ ప్రాంతం చెత్తచె దారంతో నిండిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి మండలంలోని ప్రసిద్ధి చెందిన పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి దేవస్థానానికి వెళ్లే భక్తులు ఈ బస్టాప్ వద్దే దిగుతారు. బస్సు, ఆటోల కోసం వారు ఇక్కడ నిలబడాల్సి వస్తుంది. అయితే బస్టాప్ వద్ద అపరిశు భ్రంగా ఉండడంతో మహిళలు, వృద్ధులు కూర్చోవాలంటే నీడలేకుండ పోయిందని పలువురు భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్ షెల్టర్‌ను శుభ్రం చేయించాలని కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....