Share News

OZONE: ఓజోన పొరను కాపాడుకుందాం : ప్రిన్సిపాల్‌

ABN , Publish Date - Sep 17 , 2025 | 12:31 AM

ఓజోన పొరను కా పాడుకుందామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ స్మిత పేర్కొన్నారు. ప్రపంచ ఓజోన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కళాశాలలో అవగాహన కల్పించారు. ఇండియన రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఎనసీసీ, ఎనఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్ర మం నిర్వహించారు.

OZONE: ఓజోన పొరను కాపాడుకుందాం : ప్రిన్సిపాల్‌
A scene of a rally in town

కదిరి అర్బన, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఓజోన పొరను కా పాడుకుందామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ స్మిత పేర్కొన్నారు. ప్రపంచ ఓజోన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కళాశాలలో అవగాహన కల్పించారు. ఇండియన రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఎనసీసీ, ఎనఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ... మానవాళి మనుగడుకు అత్యవసరమైన ఓజోన పొరను కాపాడుకో వాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నా రు. అనంతరం కళాశాల నుంచి పట్టణంలోని కాలేజీ సర్కిల్‌ వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సుబ్బారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, చెన్నారెడ్డి, క్రిష్ణానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 17 , 2025 | 12:31 AM