WATER: తాగునీటికి ఇబ్బందులు
ABN , Publish Date - Sep 15 , 2025 | 12:05 AM
మండలంలోని కటారు పల్లి పంచాయతీ ద్వారణా ల గ్రామంలో కాలిపోయిన తాగునీటి బోరు మోటా రుకు మరమ్మతులు చే యాలని గ్రామస్థులు కోరు తున్నారు. నెలరోజుల క్రితం మోటారు కాలిపోవ డంతో గ్రామంలో తాగునీటికి తీవ్ర సమస్య ఏర్పడిందంటున్నారు.
గాండ్లపెంట, సెప్టెంబరు13 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కటారు పల్లి పంచాయతీ ద్వారణా ల గ్రామంలో కాలిపోయిన తాగునీటి బోరు మోటా రుకు మరమ్మతులు చే యాలని గ్రామస్థులు కోరు తున్నారు. నెలరోజుల క్రితం మోటారు కాలిపోవ డంతో గ్రామంలో తాగునీటికి తీవ్ర సమస్య ఏర్పడిందంటున్నారు. పలుమార్లు పంచాయతీ కార్యదర్శి, సర్పంచకు తెలిపినా, పట్టించుకోలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మోటారుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.