Share News

MLA: విద్యార్థులకు సౌకర్యాల కల్పనకు కృషి

ABN , Publish Date - Sep 17 , 2025 | 12:16 AM

విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్సిస్తూ, విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన మంగళవారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో నూతనంగా పీఎం సీ నిధులతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

MLA: విద్యార్థులకు సౌకర్యాల కల్పనకు కృషి
MLA Kandikunta speaking in Gandlapenta Sabha

విద్యాభివృద్ధే ధ్యేయం : ఎమ్మెల్యే కందికుంట

గాండ్లపెంట, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్సిస్తూ, విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన మంగళవారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో నూతనంగా పీఎం సీ నిధులతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ. 23లక్షలకుపైగా కెమిసీ్ట్ర ల్యాబ్‌, కిచెన గార్డెన, రైనవాటర్‌హార్డ్‌ వెస్టింగ్‌ తది తర పనులను పాఠశాల కమిటీ ఛైర్మన రెడ్డినాయక్‌, ఎంపీపీ సోముశేఖర్‌ రెడ్డి, మాజీ సర్పంచ ప్రసాద్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం విద్యార్థుల చదు వులకోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు.


విద్యా శాఖ మంత్రి నారాలోకేష్‌ నూతన ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారన్నారు. ప్రతిభా విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ బాబురావు, ఎంఈఓలు క్రిష్ణానాయక్‌, శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయుడు సురేష్‌, ఉపాధ్యాయులు, టీడీపీ మండల కన్వీనర్‌ కొండయ్య, సర్పంచలు రహంతుల్లా, అక్రమబాషా, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫీడింగ్‌ రూమ్‌ ప్రారంభం

కదిరిఅర్బన: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ఫీడింగ్‌ రూమ్‌ను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన దిల్షాదున్నీషా మంగళవారం ప్రారంభించారు. బహిరంగప్రదేశాల్లో చిన్నారులకు పాలు తాగించడానికి తల్లులు ఇబ్బందులు పడకుండా ఫీడిం గ్‌ రూమ్‌ సురక్షితమన్నారు. ఈ గది ఏర్పాటుకు సహకరించిన రోటరీ క్లబ్‌ కదిరి శాఖ వారికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని 16 వార్డులో సీసీరోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. రూ.17 లక్షల వ్యయంతో సీసీరోడ్డు పనులు చేపడుతు న్నట్లు తెలిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన దిల్షాదున్నీషా, నాయకులు పవనకుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, డైమండ్‌ ఇర్ఫాన, బాహుద్దీన తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 17 , 2025 | 12:16 AM