TANK: నిర్మించారు... వదిలేశారు
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:13 AM
మండల వ్యాప్తంగా పశు వు ల దాహార్తి తీర్చడానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద 45 నీటి తొట్టె లు నిర్మించారు. వాటికి పైప్‌లైన ఏర్పాటు చేసి, నీటిని సరఫరా చేయ డం లేదు. ఈ యేడాది వర్షాలు తక్కువగా నమోదు కావడంతో మండలం లో నీటి నిల్వలు లేవు. పలు గ్రామాల్లో తొట్టెలకు నీటిని సరఫరా చేయక పోవ డంతో పశువుల దాహార్తి తీర్చేందుకు వాటి యజమానులు ఇబ్బందులు పడుతున్నారు.
నిరుపయోగంగా నీటి తొట్టెలు
అమడగూరు, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా పశు వు ల దాహార్తి తీర్చడానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద 45 నీటి తొట్టె లు నిర్మించారు. వాటికి పైప్‌లైన ఏర్పాటు చేసి, నీటిని సరఫరా చేయ డం లేదు. ఈ యేడాది వర్షాలు తక్కువగా నమోదు కావడంతో మండలం లో నీటి నిల్వలు లేవు. పలు గ్రామాల్లో తొట్టెలకు నీటిని సరఫరా చేయక పోవ డంతో పశువుల దాహార్తి తీర్చేందుకు వాటి యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక తొట్టె నిర్మించడానికి దాదాపు రూ.40 వేలు చొప్పున 45 నీటి తొట్టెలకు రూ.15,48 వేలు పైచిలుకు వెచ్చించారు. మండలంలోని పూ లకుంట్లపల్లి, తనకంటి వారిపల్లి, కొట్టువారిపల్లిల్లో నీటి తొట్టెలకు పైప్‌లైన అమర్చలేదు. నిర్మించి నాలుగు నెలలు అవుతున్నా ఖాళీ తొట్టెలు దర్శన మిస్తున్నాయి. ఇదిలా ఉండగా నీటి తొట్టెలను పూర్తిస్థాయిలో నిర్మిం చినా బిల్లులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు పలు వురు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. మండల వ్యాప్తంగా 40శాతం తొట్టెలు పూర్తి అయ్యాయి. అయితే తొట్టెల నిర్మాణంలో నాణ్యత కొరబడిందనే విమ ర్శలు ఉన్నాయి. ముందుగా కంకరతో బెడ్డింగ్ వేసి దానిపై తొట్టెలు నిర్మిం చాల్సి ఉంది. అలా చేయకపోవడంతో నీరు లీకేజీ అయి త్వరగా తొట్టెలు దెబ్బతినే అవకాశముందని ప్రజలు అంటున్నారు.
నిధుల వచ్చిన వెంటనే బిల్లులు
- మధుసూదన, ఏపీఏ, ఉపాధి హామీ పథకం, అమడగూరు
తొట్టెలు నిర్మించిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు ఎలాంటి బిల్లులు చెల్లిం చలేదు.పూర్తిగా పరిశీలించి, నివేదికలు పంపాం. నిధులు వచ్చిన వెంటనే బిల్లులు చెల్లిస్తాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....