CROP: వర్షానికి నీట మునిగిన మొక్కజొన్న
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:43 AM
మండలంలోని బొం తపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు వంకలు, వాగులు, చెరువులు, కుంటలు పొంగిపోర్లాయి. బొంతలపల్లికి చెందిన రామిరెడ్డి మూ డున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగుచేశారు. పంట సాగు చేయడానికి రూ.50వేలుకు పైగా ఖర్చు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో భారీగా కురిసిన వర్షాలకు పూర్తిగా నీటిలో మునిగి పోయింది.
తనకల్లు, సెప్టెంబరు22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బొం తపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు వంకలు, వాగులు, చెరువులు, కుంటలు పొంగిపోర్లాయి. బొంతలపల్లికి చెందిన రామిరెడ్డి మూ డున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగుచేశారు. పంట సాగు చేయడానికి రూ.50వేలుకు పైగా ఖర్చు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో భారీగా కురిసిన వర్షాలకు పూర్తిగా నీటిలో మునిగి పోయింది. గ్రామానికి చెందిన రంగప్ప, రమేష్ సాగుచేసిన రెండు ఎకరాల మొక్కజొన్న పంట పైనున్న కాలువలు పొంగడంతో పూర్తిగా నేలమట్టమైంది. రూ. 5లక్షలు నష్టం జరిగినట్లు బాధితు లు ఆవేదన చెందారు. పంట చేతికొస్తుందన్న తరుణంలో వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతినిందని బాధపడ్డారు. ప్రభుత్వం పరి శీలించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి, ఆదుకోవాలని కోరారు.