ELECTRICITY: విద్యుత సరఫరాలో నిత్యం అంతరాయం
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:29 AM
మండలకేంద్రంలో నిత్యం వి ద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని, ఆ శాఖ అధికారు లు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. గృహాలకు అంది స్తున్న విద్యుత సరఫరాలో నిత్యం అంతరాయం ఏర్పడు తోందని వాపోతు న్నారు. రాత్రింబవళ్లు పలుమార్లు విద్యుత పోతూ వస్తోందంటున్నారు.
పట్టించుకోని విద్యుత అధికారులు: గాండ్లపెంట వాసులు
గాండ్లపెంట, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో నిత్యం వి ద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని, ఆ శాఖ అధికారు లు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. గృహాలకు అంది స్తున్న విద్యుత సరఫరాలో నిత్యం అంతరాయం ఏర్పడు తోందని వాపోతు న్నారు. రాత్రింబవళ్లు పలుమార్లు విద్యుత పోతూ వస్తోందంటున్నారు. రాత్రి సమయంలో విద్యుత అంతరాయం ఏర్పడితే ఉక్కపోత, దోమలతో ఇబ్బందులు పడుతున్నా మని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా గాండ్లపెంట ప్రధాన రహదారిలో పచ్చని చెట్ల కొమ్మలు విద్యుత తీగలపై పడడంతోనే తరచూ విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని గ్రామస్థులు అంటున్నారు. మండలకేంద్రంలోని కదిరి-గాండ్లపెంట రహ దారిలోని విద్యుత తీగలకు పచ్చని కొమ్మలు తగులుతున్నాయంన్నారు. అధికారులు మాత్రం మండల కేంద్రంలోని సమస్యలు గుర్తిం చకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఇలాంటి సమస్యపై దృష్టి సారించి, విద్యుత సరఫరాలో అంతరాయం అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.