HEALTH: జాగ్రత్తలు తీసుకోవాలి : డీఎంహెచఓ
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:00 AM
ప్రస్తుతం సీజనలో జ్వరాలు ప్రబలుతున్నాయని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీఎంహెచఓ ఫైరోజ్ బేగం పేర్కొన్నారు. ఆమె గురువారం పట్టణంలోని నాలుగు అర్బన హెల్త్ సెంటర్లతో పాటు నల్లచెరువు మండలంలోని ఎం. అగ్రహా రంలో పర్యటించారు. ఎం. అగ్రహారం ప్రాథమిక కేంద్రంలో మహిళ ఆ రోగ్యం, కుటుంబ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కదిరి, సెప్టెంబరు18 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుతం సీజనలో జ్వరాలు ప్రబలుతున్నాయని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీఎంహెచఓ ఫైరోజ్ బేగం పేర్కొన్నారు. ఆమె గురువారం పట్టణంలోని నాలుగు అర్బన హెల్త్ సెంటర్లతో పాటు నల్లచెరువు మండలంలోని ఎం. అగ్రహా రంలో పర్యటించారు. ఎం. అగ్రహారం ప్రాథమిక కేంద్రంలో మహిళ ఆ రోగ్యం, కుటుంబ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించారు. ఆమెతో పాటు డిప్యూటీ డీఎంహెచఓ నాగేంద్రనాయక్, వైద్యాధికారులు అలేఖ్య, కల్పన, జంషీర్, ఉషా, వైద్య సిబ్బంది దేవలనాయక్, రామాంజులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....