Home » Kadiri
మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి ఏసు క్రీస్తు భూలోకానికి వచ్చాడని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా గురువా రం పట్టణంలోని పలు చర్చిల్లో జరిగిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే పాల్గొ న్నారు.
భక్తి భావంతో దేశ సమై క్యత కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని శృంగేరి విరూపాక్ష మఠం పీఠానికి చెందిన విద్యానృసింహభారతి పేర్కొన్నారు. మతమార్పిడి, మ త విద్వేషాలను నిరోధించాలని పిలుపునిచ్చారు. మండలకేంద్రం లోని గీతా మందిరంలో బుధవారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ సమ్మే ళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
మండలకేంద్రమైన తనకల్లు, అలాగే కొక్కంటి క్రాస్‌లో జాతీయ రహదారి విస్తరణ కార్యక్రమాన్ని ఎని మిదేళ్ల క్రితం చేపట్టారు. అప్పట్లో కొక్కంటి క్రాస్, తనకల్లులో డివైడర్లను నిర్మించి, వాటి మధ్యలో విద్యుత స్తంభాలను ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఆ స్తంభాలకు లైట్లను కూడా అమర్చారు.
సమాజంలో హిందువుల ఐక్యత కోసమే హిందూ సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీకైలసనాథ ఆశ్రమ మాతాజీ భవ్యానందమాతాజీ సోమవారం పేర్కొ న్నారు. మండలపరిధిలోని మునగలవారిపల్లిలో వెలసిన లక్ష్మీ చెన్నకేశ వస్వామి ఆలయంలో సోమవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు.
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరై చెక్కులను సోమవారం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సోమవారం స్థానిక ఆర్అండ్బి బంగ్లాలో పంపిణీ చేశారు. నియోజక వర్గంలోని 22మందికి మంజూరైన రూ. 12,28,362 లక్షల చెక్కులను అందజేశారు.
పోలియో రహహిత సమాజం స్థాపిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం పట్టణంలోని గొల్లమ్మ మండపం ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు.
గ్రామాల్లో పరసరాల పరిశుభ్రత కోసం పంచాయతీలలో స్వచ్ఛ భారత కార్యక్రమా న్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. ప్రతి పంచాయతీలోని గ్రా మాలలో వీఽధుల పరిశుభ్రత కోసం ప్రభుత్వం స్వచ్ఛతా రాయబారులను నియమించింది.
ఆది, అంతం లేని సనాతన ధర్మం ప్రపంచమంతటా వ్యాపించి ఉంటుందని ఆర్ఎస్ ఎస్ కార్యకర్తలు పేర్కొన్నారు. మండలపరిధిలోని ఆనందాశ్రమం వద్ద శనివారం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. చేయి చేయి కలిపి అందరు సమైక్యంగా హిందూ ధర్మ స్థాపనకు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ముస్తాబ్ కార్యక్ర మానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు.
హంద్రీనీవా నీటి తో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని పాలకులు ఇచ్చిన మాట ను నిలపెట్టుకున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి చెర్లోపల్లి రిజర్వా యర్కు, అక్కడి నుంచి చిత్తూరు వరకు నీటి సరఫరాకు వెళ్లే ప్రధాన కాలువ నుంచి కదిరి నియోజకవర్గంలో చెరువులకు నీరు నింపేందుకు చిన్న కాలువలు తీశారు.