SCHOOL: మోడల్ స్కూల్ లేక ఇబ్బందులు
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:49 PM
కదిరి ని యోజకవర్గంలోనే తనక ల్లు మండలం పెద్దది. ఈ మండలానికి ఓ వైపు కర్ణాటక రాష్ట్రం, మరో వైపు అన్నమయ్య జిల్లా సరి హద్దులుగా ఉన్నా యి. మండల పరిధిలోని 17 పంచాయతీలు, 20 రెవెన్యూ గ్రామాలు, 186 కుగ్రామాలు ఉన్నాయి.
- ఇతర మండలాలకు వెళితే నానలోకల్ సమస్య
-అవకాశం లేక మధ్యలోనే చదువులు మానేస్తున్న బాలురు
తనకల్లు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కదిరి ని యోజకవర్గంలోనే తనక ల్లు మండలం పెద్దది. ఈ మండలానికి ఓ వైపు కర్ణాటక రాష్ట్రం, మరో వైపు అన్నమయ్య జిల్లా సరి హద్దులుగా ఉన్నా యి. మండల పరిధిలోని 17 పంచాయతీలు, 20 రెవెన్యూ గ్రామాలు, 186 కుగ్రామాలు ఉన్నాయి. మండలంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 86, ఉన్నత పాఠశాలలు ఆరు, గిరిజన గురుకు ల బాలికల పాఠశాల, కేజీబీవీ ఉన్నాయి. అయితే మండలానికి మోడల్ స్కూల్ లేకపోవడం ఇక్కడి విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ని యోజకవర్గంలోనే అత్యధిక జనాభా కలిగిన తనకల్లు మండలానికి గతంలో మోడల్ స్కూల్ మంజూరైనా రాజకీయ కారణా ల వల్ల నిర్మా ణానికి నోచుకోలేదు. ఆ తరువాత పదేళ్లుగా ప్రభుత్వాలు మారుతున్నా, మోడల్ స్కూల్ మంజూరుకాలేదు. మండలంలో మోడల్ పాఠశాల మంజూరు చేయాలని స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను, నాయకులను కోరినా, ప్రయోజనం లేకుండా పోయింది.
దీంతో తమ పిల్లలను మోడల్ స్కూల్‌లో చేర్పించుకోవడానికి ఇతర మండలాలకు వెళ్లినప్పుడు నానలోక్ సమస్య ఎదురవుతున్నట్లు తల్లిదండ్రులు వాపో తున్నారు. వైసీపీ పాలనలో అదిగో, ఇదిగో అంటూనే కాలం గడిచిపో యింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్ట గానే మండల వాసుల ఆశలు చిగురించాయి. ఎమ్మెల్యే కందికుం ట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ మంజూరవుతుందని సంతోషించా రు. కా నీ కూటమి అధికారం చేపట్టి రెండేళ్లు అయినా ఇంతవరకు ఆ దిశగా ఎ టువంటి చర్యలు కనబడలేదు. ఇప్పటికైనా మోడల్ స్కూల్ మంజూరు చేయాలని కోరుతూ.... ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినట్లు మండల రాజకీయ నాయకులు తెలిపారు. ఎమ్మె ల్యే కూడా తనకల్లుకు మోడల్‌స్కూల్ మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చినట్లు వివరించారు. దీంతో త్వరలోనే మోడల్ స్కూల్ మంజూర వుతుందనే ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. త్వరగా మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....