MEETING: టీ, బిస్కెట్ ఇచ్చేందుకా సమావేశాలు..?
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:02 AM
స్థానిక ప్రజాప్రతినిధులకు టీ, బిస్కెట్ ఇచ్చేందు కు సమా వేశాలు ని ర్వహిస్తున్నారా? అం టూ వెంకటాపురం ఎం పీటీసీ శ్రీనివాసులు అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. గత సమావే శంలో తెలిపిన సమస్యల ఎంతవరకు పరిష్కరించారని నిలదీశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీపీ తుమ్మల పర్వీన షామీర్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది.
అధికారుల తీరుపై మండిపడ్డ సభ్యులు
ఓబుళదేవరచెరువు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రజాప్రతినిధులకు టీ, బిస్కెట్ ఇచ్చేందు కు సమా వేశాలు ని ర్వహిస్తున్నారా? అం టూ వెంకటాపురం ఎం పీటీసీ శ్రీనివాసులు అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. గత సమావే శంలో తెలిపిన సమస్యల ఎంతవరకు పరిష్కరించారని నిలదీశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీపీ తుమ్మల పర్వీన షామీర్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతుండగా ఎంపీటీసీ శ్రీనివాసులు జోక్యం చేసుకొని గత సమావేశాల్లో మీ దృష్టికి వచ్చిన ఎన్ని సమస్యలు పరిష్కరించారని ప్రశ్నించారు. కొండకమర్లలో రెగ్యుల ర్ వైద్యాదికారి లేకపోవడంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ జగనమోహన చౌదరీ తెలిపారు. స్థానిక కదిరి - హిందూపురం ప్రధన రహదారి మరమ్మతులు వెంటనే చే పట్టాలని సభ్యులు కోరారు. మండలంలో వీఽధి లైట్లు వేయాలని సర్పం చలు కోరారు. సమావేశంలో మండల ప్రఽత్యేక అధికారి రామకృష్ణ, ఎంపీడీవో శివరాంప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో అంజినప్ప, వైస్ ఎంపీపీ లక్ష్మీదేవి, హార్టికల్చర్ అధికారి లావణ్య, ఎంఈఓ సురేష్‌బాబు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....