Share News

MLA: సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:31 AM

ప్రజల సమస్యలు తెలుసు కొని వాటిని పరిష్కరించేందుకు ప్రజాదర్భార్‌ కార్యక్రమం నిర్వహిస్తు న్నామని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ తెలిపారు. మండలం లోని కె.పూలకుంట పంచాయతీలో ఎమ్మెల్యే శనివారం ప్రజా దర్భార్‌ నిర్వహించారు. ముందుగా గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను అధి కారులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ప్రజాద ర్బార్‌ నిర్వహించారు.

MLA: సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

- ఎమ్మెల్యే కందికుంట

నల్లచెరువు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలు తెలుసు కొని వాటిని పరిష్కరించేందుకు ప్రజాదర్భార్‌ కార్యక్రమం నిర్వహిస్తు న్నామని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ తెలిపారు. మండలం లోని కె.పూలకుంట పంచాయతీలో ఎమ్మెల్యే శనివారం ప్రజా దర్భార్‌ నిర్వహించారు. ముందుగా గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను అధి కారులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ప్రజాద ర్బార్‌ నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీ కాలువలు, నూతన సామాజిక పిం ఛనలు ఇళ్లు, ఇంటి రుణాలు, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా సాయం కో సం గ్రామస్థులు వినతులు అందజేశారు. గ్రామ సచివాల యంలో సి బ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్నామని, అంగనవాడీ కేంద్రానికి ప్రహరీ నిర్మించాలని గ్రామస్థులు ఎమ్మెల్యేని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ వార్డు స్థాయి నాయకుల నుంచి సీఎం వరకు ప్రతి ఒక్కరూ ప్రజల కోసం పని చేస్తున్నామని, గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. భూ స మస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తహసిల్దార్‌ రవినా యక్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అశోక్‌కుమార్‌రెడ్డి, టీడీ పీ మండల కన్వీనర్‌ రాజ శేఖర్‌బాబు, మాజీ జడ్పీటీసీ అబ్దుల్‌ ఖాదర్‌, సింగిల్‌ విండో చైర్మన కుండ వెంకటరమణ, నాయకులు నాగ భూషణ్‌ నాయుడు, సతీష్‌ రాయల్‌, అంజనప్ప , కిరణ్‌కుమార్‌ నా యుడు, మ హమ్మద్‌, నాస్‌ నరసింహులు, ఆనంద్‌, దేవేంద్ర గౌడ్‌, గంగులప్ప, రామ్‌ ప్రసాద్‌, కొర్ల భరత, వెంకటేష్‌, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 01 , 2026 | 12:31 AM