FIRE: అగ్ని ప్రమాదంలో వేరుశనగ పొట్టు దగ్ధం
ABN , Publish Date - Feb 02 , 2026 | 12:02 AM
మండల కేంద్రంలోని జనజీవన రైతు ఉత్పత్తి దారుల సంఘం కార్యాలయంలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ. 5లక్షలు విలువ చేసే వేరుశనగ పొట్టు పూర్తిగా కాలిపోయింది.
నల్లచెరువు, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జనజీవన రైతు ఉత్పత్తి దారుల సంఘం కార్యాలయంలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ. 5లక్షలు విలువ చేసే వేరుశనగ పొట్టు పూర్తిగా కాలిపోయింది. సంఘం సభ్యులు తెలిపిన వివరాల మేరకు... ఉత్పత్తిదారుల సంఘం కార్యాలయంలో విద్యుత ట్రాన్సఫార్మర్ వద్ద షాట్ సర్క్యూట్ అయింది. దీంతో నిప్పురవ్వలు ట్రాన్సఫార్మర్ చుట్టూ ఉన్న ఎండు గడ్డిపై పడి మండల సమీపంలోని వేరుశనగ పొట్టుకు వ్యాపించాయి. దీంతో చూస్తుం డగానే వేరుశనగ పొట్టు మంటల్లో కాలి బూడిద అయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....