Share News

PROBLEMS: ప్రధాన రహదారిపై వెలగని వీధిలైట్లు

ABN , Publish Date - Jan 29 , 2026 | 11:37 PM

మండలకేంద్రమైన త నకల్లుకు బ్రిటిషు పాల కుల కాలంలోనే పెద్ద పే రుంది. అప్పట్లో కదిరి తాలూకాలోనే పెద్ద ఫి ర్కాగా నమోదైంది. అ లాంటి తనకల్లు ప్రస్తు తం మండలకేంద్రం. పే రుకే మండలకేంద్రం, మే జర్‌ గ్రామ పంచాయతీ కానీ అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో ఉంది. తనకల్లులో జాతీయ రహ దారి విస్తరణలో భాగంగా డివైడర్లు నిర్మించి, వీధి లై ట్లు ఏర్పాటు చేశారు.

PROBLEMS: ప్రధాన రహదారిపై వెలగని వీధిలైట్లు
Street lights not working on the national highway in Tanakallu

సిమెంటు రోడ్లు, డ్రైనేజీకి నోచుకోని ఇందిరా నగర్‌

మండలకేంద్రంలోని ప్రధాన ప్రాంతాల్లో పరిస్థితి

పట్టించుకోని అధికారులు

తనకల్లు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రమైన త నకల్లుకు బ్రిటిషు పాల కుల కాలంలోనే పెద్ద పే రుంది. అప్పట్లో కదిరి తాలూకాలోనే పెద్ద ఫి ర్కాగా నమోదైంది. అ లాంటి తనకల్లు ప్రస్తు తం మండలకేంద్రం. పే రుకే మండలకేంద్రం, మే జర్‌ గ్రామ పంచాయతీ కానీ అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో ఉంది. తనకల్లులో జాతీయ రహ దారి విస్తరణలో భాగంగా డివైడర్లు నిర్మించి, వీధి లై ట్లు ఏర్పాటు చేశారు. అయితే ఆ వీధిలైట్లు రెండేళ్లు వెలగడంలేదు. పలుమార్లు అధికారులకు విన్నవించి నా, పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకపోతే మండల కేంద్రంలో మురుగునీటి కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. 1980లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పా లనలో ఇందినగర్‌ ఏర్పాటు అయింది. కానీ నేటివరకు ఇందిరానగర్‌లోని చాల ప్రాంతాలు సిమెంటురోడ్టకు నోచుకోలేదు. దీంతో మురుగునీటి కాలువలు లేక ప్రజలు పడుతున్న బాధలు వర్ణాణాతీతం. ప్రభుత్వాలు , పాలకులు మారుతులున్నా తనకల్లు మాత్రం అభివృద్ధికి నోచుకోలే దన్న విమర్శలు వెలువెల్తుతున్నాయి.


నిత్యం ఇందిరానగర్‌లోని వీధుల్లో నీరు నిలువ ఉండి ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు పోలీస్‌ స్టేషన వద్ద నుంచి వెళ్లే మురుగునీరు ఓ చోట నిలువ ఉండి దుర్గంధం వెదజల్లుతోంది. రైల్వేస్టేషనరోడ్డుకు ఇరువైపుల దుకాణదారులు ఆక్రమ ణలు చేయడంతో పోలీస్‌స్టేషన రోడ్డులో నిత్యం ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎదురుగా నాలుగుచక్రాల వాహనం వచ్చిందంటే ట్రాఫిక్‌ స్తంభించి పోతుంది. ఈ సమస్యలపై అఽధికారులకు వినతులు అందించినా, స్పందించేనాథుడే లేడు. ఇప్పటికైనా అఽధికారు లు, ప్రజాప్రతినిధులు స్పందిం,చి తనకల్లు మేజర్‌ పంచాయతీలో నెలకున్న సమస్యలను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం

, క్రిష్ణమూర్తిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి: తనకల్లు

జాతీయ రహదారిలో వీఽధిలైట్లను నిర్వహణ బాధ్యత జాతీయ రహ దారి అధికారులదే. ఇక తనకల్లు పంచాయతీలోని మురుగునీటి కాలువలు, సిమెంటు రోడ్ల ఏర్పాటు విషయమై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లతాం. రోడ్డు ఆక్రమణల విషయంలో ఇప్పటికే నోటీసులు జారీచేశాం. మరోసారి నోటీసులిచ్చి ఆక్రమణలను తొలగిస్తాం


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 29 , 2026 | 11:37 PM