WATER: 490 కిలోమీటర్లు దాటిన కృష్ణాజలాలు
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:18 AM
హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ ద్వారా నీటి ప్రవాహం ఇప్పటివరకు 490కిలోమీటర్ల దూరాన్ని అధిగమించినట్లు హెచ ఎనఎస్‌ఎస్ ఈఈ అమరనాథ్‌రెడ్డి, డీఈఈ రెడ్డెప్పరెడ్డి తెలిపారు. హంద్రీనీవా కాలువను వారు సోమవారం పరిశీలించారు.
నంబులపూలకుంట, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ ద్వారా నీటి ప్రవాహం ఇప్పటివరకు 490కిలోమీటర్ల దూరాన్ని అధిగమించినట్లు హెచ ఎనఎస్‌ఎస్ ఈఈ అమరనాథ్‌రెడ్డి, డీఈఈ రెడ్డెప్పరెడ్డి తెలిపారు. హంద్రీనీవా కాలువను వారు సోమవారం పరిశీలించారు. హంద్రీనీవా ద్వారా కృష్ణాజలాలు జిల్లాలోని చెరువులను, కుంటలను నింపి, ప్రస్తుతం అన్నమయ్యజిల్లాలోని వెలిగల్లు ప్రాజెక్టులో కి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. 490 కిలోమీటర్లు కృష్ణాజలాలు రావడం ఇదే మొదటిసారన్నారు. చెరువులను, కుంటలు వర్షా కాలాన్ని తలపించేలా జలకళ సంతరించుకున్నాయని అన్నారు. దీంతో సాగు, తాగునీటికి వేసవిలో ఇబ్బంది ఉండదని వారు పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....