SCHOOL: నిధులున్నా అభివృద్ధి శూన్యం
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:59 PM
ప్రభుత్వ పాఠశాలల అభివృధ్ది కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎ న్నో నిధులు ఖర్చు చేస్తోం ది. ప్రభుత్వ పాఠశాలలను అభివృధ్ది వైపు తీసుకెళ్లాల న్నది ప్రభుత్వాల లక్ష్యం. అయితే లక్ష్యాన్ని నెరవేర్చ డంలో అధికారులు, ప్రభు త్వ ఉద్యోగులు విఫలమవు తున్నారని ప్రజలు చర్చిం చుకుంటున్నారు.
- అసౌకర్యాల నడుమే విద్యార్థుల చదువులు
- పీఎం శ్రీ పథకానికి ఎంపికైన పాఠశాల పరిస్థితి ఇది
గాండ్లపెంట, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల అభివృధ్ది కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎ న్నో నిధులు ఖర్చు చేస్తోం ది. ప్రభుత్వ పాఠశాలలను అభివృధ్ది వైపు తీసుకెళ్లాల న్నది ప్రభుత్వాల లక్ష్యం. అయితే లక్ష్యాన్ని నెరవేర్చ డంలో అధికారులు, ప్రభు త్వ ఉద్యోగులు విఫలమవు తున్నారని ప్రజలు చర్చిం చుకుంటున్నారు. అందుకు గాండ్లపెంట జిల్లా పరిషత ఉన్నత పాఠశాల నిదర్శనం. ఈ పాఠశాలను పీఎంశ్రీ పథకం కింద ఎంపిక చేశారు. నిధులు భారీ స్థాయిలో వస్తున్నాయి. వాటితో పాఠశాలలో అదనపు గదులు నిర్మాణం చేపట్టాలి. తరగతి గదులలో విద్యార్థులకు బల్లలు, టీచింగ్ బోర్డులు, ఫ్యానలు, విద్యుత దీ పాలు తదితర పలు రకాల సౌకర్యాలు కల్పించాలి. అలాగే విద్యార్థులకు క్రీడా మైదానం, టాయిలెట్‌లు, గ్రంఽథాలయం, సైన్స ల్యాబ్ తదితర వసతులతో విద్యార్థులకు నూతన పద్ధతిలో విద్యను అందించేందుకు పీఎంశ్రీ పథకం ముందుకొస్తోంది. పీఎంశ్రీ పథకం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గాండ్లపెంట ఉన్నత పాఠశాలకు పలు రకాల నిధులు అందిస్తోంది.
ఈ పాఠశాలలో అభివృద్ధి అటకెక్కుతోంది. విద్యార్థులు అసౌకర్యాలు నడుమ చదువులు సాగిస్తున్నారు.
కనీస సౌకర్యాలు కూడా కరువు
గాండ్లపెంట జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో పీఎంశ్రీ పథకం కింద ప్రత్యేక నిధులు మంజూరవుతున్నాయి. ఈ పాఠశాలలో 357 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అందులో 162 మంది బాలికలు, 195 మంది బాలురు ఉన్నారు. అయితే పాఠశాలలో బాలికలకు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. బాలురు బయటకు వెళ్లాల్సి వస్తోంది. బిల్లులు అందివ్వలేదని నూతనంగా నిర్మించిన మరు గుదొడ్లకు కాంట్రాక్టర్ తాళాలు వేశాడు. అంతేగాకుండా విద్యార్థులకు సరైన ఆటస్థలం లేదు. పాఠశాలలో ఉన్న ఆటస్థలం ఆవరణమంతా పిచ్చి మొక్కలు, గడ్డి, వ్యర్థ పదార్థాలతో నిండిపోయింది. దీనిపై అధికారులు కూడా స్పందించలేదు. అలాగే కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలను తొలగించలేదు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతా యోనని విద్యార్థులక తల్లిదండ్రులు వాపోతున్నారు.
పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం- ప్రసాద్, ప్రధానోపాధ్యాయుడు
గాండ్లపెంట జిల్లా పరిషత ఉన్నతపాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. పాఠశాలకు పీఎంశ్రీ పథకం కింద నిధులు వస్తున్నాయి. వాటిని ఖర్చు చేసి దశల వారీగా పాఠశాల రూపురేఖలు మార్చేందుకు ప్రయత్నిస్తాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....