Home » Kadiri
స్ర్తీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించిన సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్ చిత్రపటా లకు క్షీరాభిషేకం చేశారు. మండలకేంద్రంలో శనివారం టీడీపీ మండలాధ్యక్షురాలు సుబాషిణి, నాయకురాలు వాల్మీకి నాగవేణి అధ్వర్యంలో క్షీరాభిషేకం చేసి, థ్యాక్యూ సీఎం అంటూ నినాదాలుచేశారు.
మండలంలో ప్రసిద్ధి చెందిన పాలపాదిన్నె ఆంజనేయస్వామి ఆల యంలో శ్రావణమా సం నాలుగో శనివారం ప్రత్యేక పూజలు ని ర్వహిం చారు. స్వామి ని దర్శించుకోవ డానికి ఉదయం నుంచే భక్తు లు క్యూ కట్టారు. తనక ల్లు, నల్లచెరువు మండ లాలకు చెందిన టీడీపీ నాయకులు రమణనా యుడు, కావడి ప్రవీణ్ కుహార్ అన్నదానం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిస్కారానికి ఆంధ్రప్రదేశ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశేషకృషి చేస్తోందని ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, పాలేల రామాంజినేయులు పేర్కొన్నారు. సంఘానికి గుర్తింపు వచ్చి ఆరేళ్లు పూర్తిచేసు కున్న సంధర్భంగా జిల్లాకేంద్రంలోని ఆంధ్రప్ర దేశ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో శనివారం సంఘం జెండాను ఆవిష్కరించి కేక్‌కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
కృష్ణాష్టమి వేడుకలను శనివా రం ఘనంగా నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న ఇస్కాన మందిరంలో జగన్నాథ, సుభద్ర, బల రామ ప్రతిమలను ఇస్కాన ధర్మవరం ధర్మప్రచారకులు శ్రీకృష్ణ మాధవ దాస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. చిన్నారులు రాధాకృష్ణులు, గోపికల వేషధారణలతో అలరించారు.
మండలకేంద్రానికి సమీపంలో రాచువారిపల్లికి వెళ్లే రహదారిలో రోడ్డుకు ఆ రువైపుల ప్రభుత్వం వివిధ హాస్టల్ భవనాలను నిర్మించింది. బీసీ బాలికల, ఎస్సీ బాలిక, బాలుర, ఎస్టీ బాలుర హాస్టళ్లను రూ. కోట్లు ఖర్చు చేసి గతంలో నిర్మించారు. వాటికి ప్రహరీ నిర్మించి, గేట్లు ఏర్పాటు చేయడంతో పాటు పూర్తి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు.
మేజర్ పంచాయతీలోని పలు కాలనీల్లో పారిశుధ్యం పడకేసింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు అస్తవ్యస్తంగా రోడ్లుపైనే పారుతోంది. దీంతో కాలనీల్లోని వీధుల్లో దుర్గంధం వెదజల్లుతోంది. దోమల బెడద ఎక్కువై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మండలకేంద్రంలోని విజయలక్ష్మీ కాలనీ, అంబేడ్కర్ కాలనీ, నూరుద్దీన కాలనీల్లో ఈ పరిస్థితి నెలకొంది.
ప్రతి ఒక్కరి మదిలో దేశభక్తిని చాటిచెప్పేలా ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం రెపరెపలా డాలని బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు పిలుపుని చ్చారు. ప్రతి ఒక్కరి హృదయం స్పందించేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆగస్టు 15న వేడుకలకు సిద్ధం కా వాలని కోరారు.
రైతుల సంక్షేమమే కూటమి ప్రభు త్వ లక్ష్యమని మాజీ మంత్రిపల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. మండలంలోని గూ నిపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు జుటూరు ప్రభాకర్‌రెడ్డి, డైరెక్టర్ శ్రీరాములు ప్రమాణ స్వీకారానికి పల్లె హాజరై మాట్లాడారు.
మండల కేంద్రంలోని విద్యుత సబ్‌స్టేషనలో గుంజేపల్లి ఫీడర్‌కు గ్రహణం పట్టింది. చిన్న చినుకు పడ్డా, గాలి వీచినా విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. బ్రేకర్లు ట్రిప్ కావడంతో విద్యుత సమస్య అధికమవుతోంది.
తల్లిపాల వారోత్సవాలు గురు వారంతో ముగిశాయి. పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాల యంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. సీడీపీఓ రాధిక మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తాగించాలని, ముర్రు పాలు బిడ్డకు మొదటి టీకా అన్నారు. బిడ్డ ఆరునెలల వయస్సు వరకు తల్లిపాలు తాగించాలన్నారు.