Share News

STUDENTS: ఆల్‌రౌండ్‌ చాంపియనగా బాలికల పాఠశాల

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:50 AM

పట్ణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఎస్‌సీఎఫ్‌ క్రీడల్లో బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఆల్‌ రౌండ్‌ ఛాంపియన షిప్‌ గెలుచుకున్నారు. రెండో స్థానంలో ఏపీ ట్రైబుల్‌ వెల్ఫేర్‌ పాఠ శాల, మూడో స్థానంలో పట్నం పాఠశాల నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు.

STUDENTS: ఆల్‌రౌండ్‌ చాంపియనగా బాలికల పాఠశాల
Kadiri school girls who won the all-round champion ship

కదిరి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి ): పట్ణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఎస్‌సీఎఫ్‌ క్రీడల్లో బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఆల్‌ రౌండ్‌ ఛాంపియన షిప్‌ గెలుచుకున్నారు. రెండో స్థానంలో ఏపీ ట్రైబుల్‌ వెల్ఫేర్‌ పాఠ శాల, మూడో స్థానంలో పట్నం పాఠశాల నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. బాలుర విభాగంలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాల మొదటి స్థానం, బ్లూమూన పాఠశాల రెండో స్థానం, పట్నం ప్రభుత్వ ఉన్న త పాఠశాల మూడోస్థానం కైవసం చేసుకున్నాయి. గెలుపొందిన వి ద్యార్థులను బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంక టాచలం, ఎంఈఓలు చెన్నకృష్ణ, ఓబులరెడ్డి అభినందించారు. ఈ క్రీడలను మండల కోఆర్డినేటర్‌ శంకర్‌నాయక్‌, పీడీలు యశోద, పద్మ, సుజాత, సంధ్య, రవీంద్రనాయక్‌ తదితరులు నిర్వహించారు.

Updated Date - Oct 26 , 2025 | 12:50 AM