ROAD: ఇలా ఉంటే... వెళ్లేదెలా..?
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:36 AM
ఇలా ఉంటే .. గ్రామంలోకి వెళ్లేది ఎలా.. బయటకు వచ్చేది ఎలాగని చిన్నరామన్నగారిపల్లి గ్రామస్థులు ప్ర శ్నిస్తున్నారు. గ్రామంలోకి వెళ్లే కూడలి వద్ద వర్షపునీరు నిలిచి దోమలకు నిలయంగా మారింది. కూడలి మొత్తం బురదమయమై గ్రామంలోకి వెళ్లడానికి వీలుకాని పరిస్థితి ఏర్పడింది. నీరు నిలువ ఉండటంతో దోమలు పెరిగి రోగాలబారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన చెం దుతున్నారు.
తనకల్లు, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ఇలా ఉంటే .. గ్రామంలోకి వెళ్లేది ఎలా.. బయటకు వచ్చేది ఎలాగని చిన్నరామన్నగారిపల్లి గ్రామస్థులు ప్ర శ్నిస్తున్నారు. గ్రామంలోకి వెళ్లే కూడలి వద్ద వర్షపునీరు నిలిచి దోమలకు నిలయంగా మారింది. కూడలి మొత్తం బురదమయమై గ్రామంలోకి వెళ్లడానికి వీలుకాని పరిస్థితి ఏర్పడింది. నీరు నిలువ ఉండటంతో దోమలు పెరిగి రోగాలబారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన చెం దుతున్నారు. తమ సమస్య పరిష్కరించాలని గ్రామ పంచాయతీ అధికారులకు తెలిపినా ప్రయోజనం లేదని తెలిపారు. పంచాయతీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయారు. గ్రామ పంచాయతీ అధికారులు కానీ, ఆరోగ్యశాఖ అధికారులు కానీ తమ గ్రామం వైపు కన్నెత్తిచూసిన పాపాన పోలేదని మండిపడ్డారు. గ్రామంలోకి వెళ్లడానికి వీలుకాని పరిస్థితిలో ఉన్న కూడలిలోని మట్టి తోలి గుంతలను పూడ్చాలని కోరారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....