CGP: సీజీపీ నుంచి నీటి విడుదల
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:50 PM
మండల పరిఽధిలోని ముండ్లవారి పల్లి సమీపంలో పాపాగ్ని నదికి అడ్డంగా నిర్మించిన సీజీ ప్రా జెక్ట్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. పది రోజులుగా కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వందమానేరు, పాపాగ్ని నది ప్రవహించ డంతో డ్యాంకు పూర్తి స్థాయిలో నీరుచేరింది. దీంతో మూడు రోజుల నుంచి ప్రతి రోజు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నా రు.
తనకల్లు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మండల పరిఽధిలోని ముండ్లవారి పల్లి సమీపంలో పాపాగ్ని నదికి అడ్డంగా నిర్మించిన సీజీ ప్రా జెక్ట్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. పది రోజులుగా కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వందమానేరు, పాపాగ్ని నది ప్రవహించ డంతో డ్యాంకు పూర్తి స్థాయిలో నీరుచేరింది. దీంతో మూడు రోజుల నుంచి ప్రతి రోజు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నా రు. శనివారం 120 క్యూసెక్కులు, ఆదివారం 200 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు సంబంధిత ఇంజనీర్ బయప్ప తెలిపారు. ప్రా జెక్ట్ కింద 1100 ఎకరాల సాగుభూమి ఉందని, ఈ ఏడాది మొత్తం భూమిని సాగు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.