PGRS: పీజీఆర్‌ఎస్‌లో సమస్యల వెల్లువ
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:12 AM
పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు సమస్యల వెల్లు వెత్తాయి. నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు అమడ గూరు మండల ప్రజలు తరవచ్చారు. మొత్తం 551 ిఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఎన్పీకుంట మం డలం వంకమద్దికి చెందిన రైతులు తాము తమ భూములను సోలార్‌కు ఇవ్వమని, తమకు జీవానాధారం అవేనని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
కదిరి/కదిరి అర్బన, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు సమస్యల వెల్లు వెత్తాయి. నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు అమడ గూరు మండల ప్రజలు తరవచ్చారు. మొత్తం 551 ిఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఎన్పీకుంట మం డలం వంకమద్దికి చెందిన రైతులు తాము తమ భూములను సోలార్‌కు ఇవ్వమని, తమకు జీవానాధారం అవేనని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా పోక్సో కేసులలో బాధితులకు ప్రభు త్వం నుంచి అందించాల్సిన పరిహారం ఇవ్వాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల వారు తమ సమస్యలపై రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వినతులు అందజేశారు. ఉపాధి హామీ పథకం, భూ సమస్యలు తదితర వాటిపై బాధితుల తరుఫు న రెడ్స్ అధ్యక్షురాలు భానుజా కలెక్టర్‌కు వినతులు అందించారు. అదేవిధంగా మున్సిపాలిటి పరిఽధిలోని సర్వె నంబర్ 83-1, 83-4 లలో గుడిసెలు వేసుకున్న వారికి ఇళ్ళు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ కలెక్టర్‌ను కోరారు.
జిల్లాకు ఒక యూనివర్సిటీ కేటాయించాలని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో ఒక్క యూనివర్సిటీ లేకపోవడం తో జిల్లా విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదేవిధంగా కదిరి పట్టణంలో పదివేల మందికి పైగా కార్మికులు బీడీ తయారీ వృత్తిపై ఆధారప డి జీవిస్తున్నారని పట్టణంలో ఈఎస్‌ఐ అసుపత్రిని ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు కోరారు. అలాగే. కదిరి ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పి వలసలు నివారించాలని కలెక్టర్‌ను కోరారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....