Share News

MLA: అవినీతికి పాల్పడితే ఉపేక్షించం : ఎమ్మెల్యే

ABN , Publish Date - Oct 29 , 2025 | 11:27 PM

మునిసిపాలిటీలో ఏ స్థాయి ఉద్యోగి అయినా అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ హెచ్చరించారు. ఎమ్మెల్యే బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలోని చైర్‌పర్సన చాంబర్‌లో చైర్‌పర్సన దిల్షాద్‌ ఉన్నీసా, వైస్‌ చైర్మెన రాజశేఖర్‌ ఆచారితో పాటు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడితే ఏ స్థాయి ఉద్యోగి అయినా ఉపేక్షించమని అన్నారు.

MLA: అవినీతికి పాల్పడితే ఉపేక్షించం : ఎమ్మెల్యే
MLA Kandikunta Venkataprasad holding a meeting with the officials

కదిరి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలో ఏ స్థాయి ఉద్యోగి అయినా అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ హెచ్చరించారు. ఎమ్మెల్యే బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలోని చైర్‌పర్సన చాంబర్‌లో చైర్‌పర్సన దిల్షాద్‌ ఉన్నీసా, వైస్‌ చైర్మెన రాజశేఖర్‌ ఆచారితో పాటు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడితే ఏ స్థాయి ఉద్యోగి అయినా ఉపేక్షించమని అన్నారు. టౌన ప్లానింగ్‌ విభాగంలో అవినీతి ఆరోప ణలు తన దృష్టికి వచ్చాయన్నారు. వాటిపై సంబంధిత ఉద్యోగులను ఎమ్మెల్యే ఘాటుగా ప్రశ్నించారు. టౌన ప్లానింగ్‌ విభాగంలో అక్రమ కట్టడాలు గుర్తించి వాటిని కూల్చివేస్తామని తెలిపారు. ఎల్‌పీటీలు ఇతర ఉద్యోగులపై ఆరోపణలు వస్తే నేరుగా ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తామన్నారు. ఖాళీ స్థలాల పన్నుల కోసం అధిక మొత్తంలో వసూలు చేస్తే చర్యలు తప్ప వన్నారు.


ఏ స్థాయిలో అవినీతికి పాల్పడినా తమకు సమాచారం అందుతుందని ఉధ్యోగుల ను హెచ్చరించారు. మున్సిపాలిటీలో పనులు సవ్యంగా సాగుతాయనే పేరు తీసుకురా వాలని ఎమ్మెల్యే సూచించారు.

అక్రమ కట్టడాలు కూల్చివేస్తాం:మునిసిపాలిటీ అనుమతి లేకుండా గతంలో కానీ ఇప్పుడు కానీ అక్రమ కట్టడాలు నిర్మిస్తే నిబంధనల మేరకు కూల్చివేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చామన్నా రు. అక్రమ కట్టాడాలను స్వచ్ఛందంగా తొలగించుకుంటే కేసులుండవని, లేదంటే అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి అయిన ఖర్చుతో పాటు కేసులు తప్పవని హెచ్చరించారు.

ప్రభుత్వ భూమిని రక్షిస్తాం:పట్టణానికి సమీపంలో ఉన్న పుట్టమాను చెరువులో కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఎమ్మెల్యే అన్నారు. రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు ప్రభుత్వ భూమిని వారంలోగా కొలతలు వేసి రక్షిస్తారని, ఇందులో ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చ రించారు.


పీవీఆర్‌ గ్రాండ్‌ సమీపంలో ఉన్న హైవేలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించామని దాన్ని కూడా రక్షిస్తామన్నారు.

క్లీన కదిరికి సహకరించండి : పట్టణం అంతా శుభ్రంగా ఉండేందుకు పట్టణంలోని ప్రతి పౌరుడు సహకరించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇంటింటికి చెత్తసేకరణ కొనసాగుతుందని, క్లీన కదిరి కోసం కౌన్సిల ర్లందరూ ప్రత్యేక కార్యక్రమాలు తలపెట్టినట్లు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌, టీడీపీ నాయకులు బాహుద్దీన, సిరి బాబయ్య, రమణ, ఉద్యోగులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 29 , 2025 | 11:27 PM