WATER: తాగునీటి సౌకర్యం కల్పించాలి
ABN , Publish Date - Oct 28 , 2025 | 10:32 PM
తాగునీటి సౌకర్యం కల్పించాలంటూ మండలపరిధి లోని దోరణాల గ్రామస్థులు కోరారు. ఈమేరకు మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మండల పరిధిలోని కటారుపల్లి పంచాయతీ దోరణాల గ్రామంలో తాగునీటి బోరు తరచూ మరమ్మతులకు గురు వుతోందని తెలిపారు.
ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి నిరసన
గాండ్లపెంట, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): తాగునీటి సౌకర్యం కల్పించాలంటూ మండలపరిధి లోని దోరణాల గ్రామస్థులు కోరారు. ఈమేరకు మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మండల పరిధిలోని కటారుపల్లి పంచాయతీ దోరణాల గ్రామంలో తాగునీటి బోరు తరచూ మరమ్మతులకు గురు వుతోందని తెలిపారు. దీంతో ఒక్కోసారి 15 నుంచి 20 రోజులు వరకు బోరు మరమ్మతుల పట్టించుకోకపోవడంతో ఆ గ్రామంలో ప్రజలకు మరియు పశువులకు తాగునీటి కొరత ఏర్పడుతోందన్నారు. ఇటీవల తాగునీటి బోరు మరమ్మతులకు రాగా తాత్కాలికంగా మరమ్మ తులు చేయించడంతో కొద్ది రోజులకే సమస్య ఏర్పడిందన్నారు. దీంతో 10 రోజులుగా తాగునీటి కోసం అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచకు, అధికారులకు తెలియ జేసినా ఫలితం లేదన్నారు. దీంతో ఎంపీడీఓ కార్యాలయానికి తాళాలు వేసి ఆ గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. నూతన బోరు, మోటార్ ఏర్పాటుచేస్తామని ఎంపీపీ సోమశేఖర్ రెడ్డి హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....