COLLECTOR: చియా సాగుపై అవగాహన కల్పించండి : కలెక్టర్
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:16 AM
జిల్లాలో చియా సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ. శ్యాంసుందర్ వ్యవశాయ శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమం అనంతరం చియా సాగు విఽధానంపై ప్రచార కరపత్రాలను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి రాము నాయక్, ఆర్డీఓ వీవీఎస్ శర్మతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.
కదిరి అర్బన, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చియా సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ. శ్యాంసుందర్ వ్యవశాయ శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమం అనంతరం చియా సాగు విఽధానంపై ప్రచార కరపత్రాలను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి రాము నాయక్, ఆర్డీఓ వీవీఎస్ శర్మతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చియా సీడ్ సాగు పద్ధతులు, నీటి నిర్వహణ, ఎరువుల వాడకం, యాజమాన్య పద్దతులపై రైతులకు విస్తృతంగా కల్పించాలన్నారు. చియా సీడ్ వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనమన్నారు. చియా విత్తనాలు పోషక విలువలు అధికంగా ఉండటం వల్ల వీటికి అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువుగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ సనావుల్లా, మండల వ్యవసాయ అధికారి శ్రీహరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.