OFFICIALS: కర్బూజ పంటను పరిశీలించిన అధికారులు
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:25 AM
మండలంలో రైతులు సాగుచేసిన కర్బూజ పంట పొలాలను ఉద్యానశాఖాధికారులు సోమవారం పరిశీలించారు. మండల వ్యాప్తంగా సాగుచేసిన పలువురు రైతులకు కర్బూజ కన్నీరు మిగిల్చింశీ ‘కన్నీళ్లు మిగిల్చిన కర్బూజ’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో సోమవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన ఉద్యానశాఖ అధికారి ప్రతాప్‌రెడ్డి మండలంలో కర్బూజ సాగు చేసిన పొలాలను పరిశీలించారు.
గాండ్లపెంట, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలో రైతులు సాగుచేసిన కర్బూజ పంట పొలాలను ఉద్యానశాఖాధికారులు సోమవారం పరిశీలించారు. మండల వ్యాప్తంగా సాగుచేసిన పలువురు రైతులకు కర్బూజ కన్నీరు మిగిల్చింశీ ‘కన్నీళ్లు మిగిల్చిన కర్బూజ’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో సోమవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన ఉద్యానశాఖ అధికారి ప్రతాప్‌రెడ్డి మండలంలో కర్బూజ సాగు చేసిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొట్లపల్లిలో రైతులతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజనలో సాగు చేసిన కర్బూజ పంటకు వాతావరణం అనుకూలించలేదని, దీంతో పంటకు తెగుళ్లు సోకాయన్నారు. కర్బూజ సాగులో రైతులు మెలుకువలు పాటించాలని, ఉద్యానశాఖ అధికారులను సంప్రదిస్తే వాటిపై సలహాలు సూచనలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ రాజేష్, ఎంపీఈఓ ఫిరోజ్, రైతులు రవీంద్రారెడ్డి, అనీల్‌కుమార్‌రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.