MLA: కార్మికులకు న్యాయం చేస్తాం
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:46 PM
అర్హులైన భవన నిర్మాణ కార్మి కులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హామీ ఇచ్చారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాల యానికి ఎదురుగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల కాలనీని గురువారం ఆయన పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులలో అర్హులైన వారంద రికీ న్యాయం చేస్తామని తెలిపారు.
పట్టాలిచ్చి, ఇళ్లు నిర్మిస్తాం : ఎమ్మెల్యే కందికుంట
కదిరి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): అర్హులైన భవన నిర్మాణ కార్మి కులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హామీ ఇచ్చారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాల యానికి ఎదురుగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల కాలనీని గురువారం ఆయన పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులలో అర్హులైన వారంద రికీ న్యాయం చేస్తామని తెలిపారు. ఎరికైనా ఇళ్లకు సంబంధించి దొంగ పట్టాలు ఉంటే వారిపైన చర్య లు తప్పవని హెచ్చరించారు. కార్మికులందరూ నిరుపేదలని పట్టాల కోసం నెలల తరబడి వారిని తిప్పడ సరికాదని అధికారులకు సూ చించారు. అర్హులైన వారందరికీ వెంటనే పట్టాలివ్వాలన్నారు. భవన నిర్మాణ కార్మికులలో ఎవరు అర్హులు అనే నివేదికను వారం రోజుల లోగా తయారుచేయాలని ఆర్డీఓను ఆదేశించారు. అర్హులైన వారంద రికీ పట్టాలిచ్చి, ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆటోనగర్ ఏర్పాటు చేయాలని వివిధ రకాల కార్మికులు ఎమ్మెల్యేకి విన్నవించారు. వెంటనే స్థలం పరిశీలించి, ఏర్పాటు చేస్తామని ఎ మ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ వీవీఎస్ శర్మ, డిప్యూ టీ తహసీల్దార్ ఈశ్వరప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....