Home » Kadiri
మహమ్మద్‌ప్రవక్త చెప్పిన విధంగా మానవతా విలువలు పాటిస్తూ పరమత సహనం, శాంతి, కలిగి ఉండాలని, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పే ర్కొన్నారు. మిలాద్ ఉన నబీ సందర్భంగా ముస్లింలు శుక్రవారం పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవక్త చెప్పిన సందేశాలు అందరికి ఆచర ణీయమే అన్నారు. ప్రతి ఒకరు వీటిని పాటించాలన్నారు.
మండలంలోని కాళస ముద్రం గ్రామం వద్ద జా తీయ రహదారిపై గురువా రం ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగి పూర్తి గా దగ్ధమైంది తమిళనా డు నుంచి పైవుడ్స్‌తో మహారాష్ట్రకు వెళ్తున్న లారీని డ్రైవర్ షణ్ముక కాళసముద్రం వద్ద ని లిపి వంట చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
కరువుకు నిలయ మైన రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభు త్వం కంకణం కట్టుకుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. వారు గురువారం ప ట్నం వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి మెయిన బ్రాంచ కెనాల్ ద్వారా తలుపుల, పులివెందుల మండలాలకు నీటిని విడుదల చేశారు.
మండలకేంద్రంలో గ్రామ సచివాలయం- 1, గ్రామ సచివాలయం- 2 ఉన్నాయి. ఇవి రెండిం టినీ పక్కనపక్కనే నిర్వహిస్తున్నారు. అయితే ఈ రెండు సచివాలయాల సిబ్బంది సమయపాలనపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సచివాలయాలు రెండిట్లో కలిపి గురువారం ఉదయం 11 గంటలైనా ఒకే ఒక ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన సిబ్బంది ఎవ్వరూ హాజరు కాలేదు.
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉండకూడదని ప్రతి గ్రామంలో ప్రభుత్వం బోర్లు, పైపులైన, మోటార్లు, తాగునీటి ట్యాంక్ తదితరా లను ఏర్పా టు చేస్తోంది. వీటి నిర్వాహణ కోసం పంచాయతీ అధికారులతో పాటు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను నియమించింది. అయితే గతంలో నీటి ట్యాంక్‌లు, పైపులు, బోర్లకు చిన్నపాటి మరమ్మతులను అధికారులు పట్టించుకోకుండా అలాగే వదిలేస్తున్నారు.
మండలంలోని జౌకుల గ్రామంలో రాఘవరెడ్డి అన వ్యక్తి ఇంటి అవరణలో ఉన్న విద్యుత స్తంభం అదివారం విరిగిపడింది. ఇంటిపైకే ఒరిగింది. ఆ సమయంలో విద్యుత సరఫరా లేదు. అయితే మూడు రోజులు గడచినా అ స్తంభాన్ని ఇంటిపై నుంచి తొలగించి మరమ్మతులు చేసేందుకు విద్యుత శాఖాధికా రులు ఎటువంటి చర్య లు చేపట్టలేదు.
స్ర్తీ శక్తి పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో ఆనందం కనిపిస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక పీవీ అర్ గ్రాండ్‌లో సోమవారం స్ర్తీ శక్తి పథకం విజయోజత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తల్లికివందనం పథకం అమలు చేసినప్పుడు ఇచ్చిన మా ట నిలబెట్టుకునే ప్రభుత్వంగా ప్రజలు భావించారని, ఇప్పుడు స్ర్తీ శక్తి పథకంతో మహిళలకు ప్రభుత్వం పట్ల పూర్తి విశ్వాసం కలిగిందని అన్నా రు.
మండలకేంద్రంలోని జిల్లాపరిషత ఉన్నతపాఠశాలలో 1994-95లో పది చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళ నాన్ని ఆదివారం నిర్వహించారు. అందరూ ఒక్క చోట చేరి గత స్మృతులను జ్ఞాపకం చేసుకున్నారు. ఒకరినొకరు క్షేమసమాచారాలు తెలు సుకుని ఆనం దం వ్యక్తం చేశారు.
మండలపరిధిలోని కొక్కంటి క్రాస్ సమీపంలో హంద్రీ నీవా కాలువలో శనివారం కృష్ణాజలాలకు కూటమి నాయకులు జలహారతి ఇచ్చారు. కాలువ వద్ద గంగమ్మకు పసుపు, కుంకుమ, పూలు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టారు. ఘనంగా జలహారతి నిర్వహించారు.
పట్టణానికి శివారు ప్రాంతంలో ఉన్న వివిధ కార్యాలయాల వద్ద యూటర్న్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి గట్లు ప్రాం తంలోని వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వరకు ఇటీవల నిర్మించిన నాలుగురోడ్ల రహదారిలో ఎక్కడా యూ టర్న్ లేదు. దాదాపు ఒకటిన్నర కిలోమీటరు వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది.