MLA: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:03 AM
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పే ర్కొన్నారు. పట్టణంలోని నిజాంవలీ కాలనీలో ఉన్న వార్డు సచివా లయంలో శుక్రవారం 11, 13, 14, 15, 16, 17 వార్డుల ప్రజల సమస్య లను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆ వార్డులకు సంబంధించిన ఫిర్యాదులను ఎమ్మెల్యే ప్రజల నుంచి స్వీకరించారు.
ఎమ్మెల్యే కందికుంట
కదిరి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పే ర్కొన్నారు. పట్టణంలోని నిజాంవలీ కాలనీలో ఉన్న వార్డు సచివా లయంలో శుక్రవారం 11, 13, 14, 15, 16, 17 వార్డుల ప్రజల సమస్య లను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆ వార్డులకు సంబంధించిన ఫిర్యాదులను ఎమ్మెల్యే ప్రజల నుంచి స్వీకరించారు. మొత్తం 768 ఫిర్యాదులురాగా, ఇందులో ఇంటిస్థలం కోసం 574, పింఛనకోసం 170, రేషనకార్డుల కోసం 20, ఇతర సమస్యలపై నాలుగు ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ఏక్కడో ఒకచోట ప్రజాదర్బార్ నిర్వహి స్తామని తెలిపారు.
అందులో వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్, తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంఇఓ ఓబులరెడ్డి, స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ పర్వీనబాను, చైర్‌పర్సన దిల్షాదున్నీషా, వైస్ చైర్మన రాజశేఖరాచారి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పవనకుమార్, నాయకులు బాహుద్దీన, సిరి బాబాయ్య, కౌన్సిలర్లు అల్ఫా ముస్తఫా, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం: నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రఽధాన లక్ష్యంగా సీఎ చంద్రబాబునాయుడు, మంత్రిసత్యకుమార్‌యాదవ్ ఆదేశాల మేరకు శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో భారీగా వినతలు అందినట్టు బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు తెలిపారు. ప్రజాదర్బార్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలపై వినతిపత్రాలను సమర్పించారు. అనంతరం హరీశబాబు మాట్లాడుతూ....ప్రజలు అందించిన అన్ని వినతులను ఆనలైన పీజీఆర్‌ఎ్‌సలో నమోదు చేసి అప్‌లోడ్ చేశామన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....