SOCIETY: ఘనంగా సహకార వారోత్సవాలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 12:19 AM
మండలకేంద్రం లోని ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సోమవారం 72వ అఖిలభారత సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చైర్మన చంద్రశేఖర్‌నాయుడు, సబ్‌డివిజనల్ సహ కార అధికారి ప్రభావతి, సీఈఓ బాబాఫకృద్దీన హాజరయ్యారు. ముం దుగా జెండాను ఆవిష్కరించారు.
నంబులపూలకుంట, నవంబరు17 (ఆంధ్రజ్యోతి) : మండలకేంద్రం లోని ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సోమవారం 72వ అఖిలభారత సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చైర్మన చంద్రశేఖర్‌నాయుడు, సబ్‌డివిజనల్ సహ కార అధికారి ప్రభావతి, సీఈఓ బాబాఫకృద్దీన హాజరయ్యారు. ముం దుగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ రుణాలు విరివిగా ఇచ్చామని తెలిపారు. ఆనలైన ద్వారా అన్ని సేవలు,
లావాదేవీలు నిర్వహిస్తున్నామన్నారు. సిబ్బంది సుమశ్రీ, శ్రీరాములు, డైరెక్టర్లు మల్లిరెడ్డి, లక్ష్మీనాయక్, వాటర్ షెడ్ ఛైర్మన మహబూబ్‌బాషా, నరసింహులు, గంగశేఖర్, మౌలాసాబ్, చింతా శ్రీనివాసులు, జనార్దననాయుడు, రైతులు పాల్గొన్నారు.
గాండ్లపెంట: మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం కార్యాలయంలో సోమవారం సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహిం చారు. సహకార సంఘం చైర్మన రామాంజులురెడ్డి ఆధ్వర్యంలో డైరెక్టర్లు, రైతులు సమావేశం నిర్వహించారు. ముందుగా సహకార సంఘం జెండా ఎగురవేసి ప్రతిజ్ఞ చేశారు. సహకార సంఘం డివిజన అధికారి జనార్దన, సీఈఓ షామీర్ బాషా, డైరెక్లర్‌లు మునాఫ్, రమణ, సర్పంచ శివప్ప నాయుడు, చంద్ర, మాజీ చైర్మన వెంకటరమణారెడ్డి, అక్రమ్‌బాషా, నరసింహులు, సికిందర్, కేకే రాజారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....