MAGISTRATE: ఆకర్షణలకు లోను కావద్దు : న్యాయాధికారి
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:15 AM
విద్యార్థి విద్య పట్ల తప్ప ఇతర ఆ కర్షణలకు లోను కాకూడ దని జూనియర్ సివిల్ కో ర్టు న్యాయాధికారి లోకనా థం పేర్కొన్నారు. పట్టణం లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇనచార్జ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహిం చిన బాలల దినోత్సవంలో న్యాయాధికారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
కదిరిలీగల్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): విద్యార్థి విద్య పట్ల తప్ప ఇతర ఆ కర్షణలకు లోను కాకూడ దని జూనియర్ సివిల్ కో ర్టు న్యాయాధికారి లోకనా థం పేర్కొన్నారు. పట్టణం లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇనచార్జ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహిం చిన బాలల దినోత్సవంలో న్యాయాధికారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇతర విద్యార్థులు ఇతర వ్యాపకాలకు అవకాశం ఇస్తే ఏకాగ్రత కోల్పోయి నష్టపోతారని కూడా స్పష్టం చేశారు. ముందుగా జవ హర్ లాల్ నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిం చారు. న్యాయ వాది లోకేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయురాలు రేణుక తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....