Share News

SMOKE: చెత్తకు నిప్పు - పొగతో ఇబ్బందులు

ABN , Publish Date - Nov 16 , 2025 | 12:49 AM

మండల కేంద్రంలోని నివాస గృహాల వద్ద ఉన్న వ్యర్థాల చెత్తకు ఎవరో నిప్పు పెట్టారు. అయిఏ ఆ చెత్త నుంచి దుర్గంధం, కలుషిత వాయువులతో కూడిన పొగ వెలువడుతోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గాండ ్లపెంటలో నిత్యం స్వచ్ఛతా రాయబారులు వీధులలో శుభ్రం చేసి చెత్త, ప్లాస్టిక్‌, చెప్పులు, పేపర్లు వంటి వ్యర్థాలను ఊరి బయట ఉన్న చెరువు పక్కన దారి వెంబడి వెస్తున్నారు.

SMOKE: చెత్తకు నిప్పు - పొగతో ఇబ్బందులు
Smoke from garbage burning

గాండ్లపెంట, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని నివాస గృహాల వద్ద ఉన్న వ్యర్థాల చెత్తకు ఎవరో నిప్పు పెట్టారు. అయిఏ ఆ చెత్త నుంచి దుర్గంధం, కలుషిత వాయువులతో కూడిన పొగ వెలువడుతోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గాండ ్లపెంటలో నిత్యం స్వచ్ఛతా రాయబారులు వీధులలో శుభ్రం చేసి చెత్త, ప్లాస్టిక్‌, చెప్పులు, పేపర్లు వంటి వ్యర్థాలను ఊరి బయట ఉన్న చెరువు పక్కన దారి వెంబడి వెస్తున్నారు. ఈ వ్యర్థాల చెత్తకుప్పలకు ఎవరో నిప్పు పెట్టారు. దీంతో వాటి నుంచి దుర్గంధం, కలుషిత వా యువులతో కూడిన పొగ వెలువడుతోందని వాటి పక్కనే నివాసం ఉంటున్న ప్రజలు అంటున్నారు. ఆ పొగ దుర్గంధం, ఘాటు భరించ లేకపోతున్నామని వాపోతున్నారు. ఆ పొగ పీల్చితే రోగాల భారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. నిత్యం ఆ చెరువు దారి వెంబడి ప్రజలు, పాదచారులు వెళ్తుంటారు. దీనిపై పంచాయతీ అధికారులు తక్షణం స్పందించి, స మస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 16 , 2025 | 12:49 AM