LEAKAGE: మరమ్మతులు మరిచారా?
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:30 PM
పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ ఎదురుగా వడ్డే ఓబన్న విగ్రహం పక్కన పైపులైన లీకేజీ ఏర్పడింది. అది రోడ్డు మధ్యలో ఉంది. గత 20 రోజులుగా ఆ లీకేజీని తప్పించడానికి మూడు డివైడర్లను అడ్డం పెట్టారు. లీకేజీ ఏర్పడి 20 రోజులైనా మున్సి పాలిటీవారు మరమ్మతులు చేయడం పట్టించుకోలేదు.
కదిరి, నవంబరు13 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ ఎదురుగా వడ్డే ఓబన్న విగ్రహం పక్కన పైపులైన లీకేజీ ఏర్పడింది. అది రోడ్డు మధ్యలో ఉంది. గత 20 రోజులుగా ఆ లీకేజీని తప్పించడానికి మూడు డివైడర్లను అడ్డం పెట్టారు. లీకేజీ ఏర్పడి 20 రోజులైనా మున్సి పాలిటీవారు మరమ్మతులు చేయడం పట్టించుకోలేదు. రోడ్డు మధ్యలో లీకేజీ ఉండడంతో వాహనాల రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లీకేజీ మరమ్మతులు చేయడం మున్సిపల్ అధికారులు మరిచారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ప్రజలకు అసౌకర్యంగా ఉన్న లీకేజీకి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....