Share News

LAYOUT: రాత్రికి రాత్రే అక్రమ లేఅవుట్లు

ABN , Publish Date - Nov 16 , 2025 | 12:31 AM

రూరల్‌ పరిధిలోని సున్నపుగుట్ట తండాలో రాత్రికి రాత్రే అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. జాతీయ రహదారికి సమీపంలో శనివారం ఉదయానికే అక్రమ లేఅవు ట్‌ సిద్ధ మైంది. ఎటువంటి అనుమతులు లేకుండానే రాళ్లు పాతి, ప్లాట్లు వేశా రు. అనధికారికంగా అగ్రిమెంట్లపై అమ్మకాలు కూడా జరిగినట్లు సమాచారం.

LAYOUT: రాత్రికి రాత్రే అక్రమ లేఅవుట్లు
Layout near Sunnapuguttathanda

పట్టించుకోని అధికారులు - ఎమ్మెల్యే ఆదేశాలే బేఖాతరు

కదిరి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): రూరల్‌ పరిధిలోని సున్నపుగుట్ట తండాలో రాత్రికి రాత్రే అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. జాతీయ రహదారికి సమీపంలో శనివారం ఉదయానికే అక్రమ లేఅవు ట్‌ సిద్ధ మైంది. ఎటువంటి అనుమతులు లేకుండానే రాళ్లు పాతి, ప్లాట్లు వేశా రు. అనధికారికంగా అగ్రిమెంట్లపై అమ్మకాలు కూడా జరిగినట్లు సమాచారం. అక్రమ లేఅవుట్లను అనుమతించవద్దని ఎమ్మెల్యే కందికుం ట వెంకటప్రసాద్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారులను హె చ్చరిస్తున్నారు. అయినా సున్నపుగుట్టతండాలో అక్రమ లేఅవుట్‌పై అధి కారుల చర్యలు శూన్యం. తూతూమంత్రంగా శనివారం అధికారులు అ లా వచ్చి ఇలా పరిశీలించి, సత్యసాయిబాబా జయంతి పనులున్నాయం టూ అక్కడినుంచి వెళ్లి పోయారు. కదరి రూరల్‌ పరిధిలోని కుమ్మర వాండ్లపల్లి పంచాయతీలో ఉన్న సున్నపు గుట్టతండా సమీపం లో హైవేకి పక్కనే దాదాపు రెండు ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు వెలిశా యి.


గత రెండురోజుల నుంచి అక్కడ చదును చేసే పనులు జరుగగా శనివారం ఉదయానికల్లా ప్లాట్లలో నాటిన రాళ్లు కనిపించాయి. ప్రస్తు తానికి అక్కడ సెంటు రూ. 13లక్షల నుంచి 15లక్షలతో ప్లాట్లు వేసి అమ్మినట్లు సమాచారం. ఇప్పటికే పేపర్‌ లేఅవుట్లలో వీటి అమ్మకాలు మొత్తం జరిగినట్లు తెలిసింది. చివరగా ప్లాట్లు కొనుగోలు చేసిన యజ మానులకు ప్లాట్లు చూపించేందుకు ఆ భూమిలో రాళ్లు పాతి ప్లాట్లు విభజించారు. వీటిని ఆయా స్థల యజమానులకు కూడా చూపించిన ట్లు తెలిసింది. అక్రమ లేఅవుట్లతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోం ది. అక్రమ లేఅవుట్లలో భవనాలు నిర్మిస్తే వాటికి రోడ్లు, కాలువలు, తాగునీరు తదితర స్థానిక సమస్యలు భరించాల్సి ఉంటుంది. అక్రమ లేఅవుట్లు వేసిన యజమానులు మాత్రం స్థలం కొనుగోలు చేసివారికి కేవలం పేపర్‌ మీదే ప్లాట్లు చూపించి అమ్మివేసి, సొమ్ముచేసుకుంటు న్నారు.


సున్నపుగుట్టతండాలో ఏర్పాటైన ఈ అక్రమ లేఅవుట్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అక్రమ లేఅవుట్లను అనుమతించం- ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌

నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమ లేఅవుట్లను అనుమతించేదిలేదు. మేము అధికారంలోకి వచ్చినప్పుడే మున్సిపాలిటీలో సమావేశాలు పెట్టి అందరికీ తెలిపాం. అక్రమ లేఅవుట్ల వల్ల మున్సిపాలిటీ ఆదాయనికి గండిపడటంతో పాటు, సౌకర్యాల కల్పనకు భారం ఏర్పడుతుంది. సున్నపుగుట్టతండాలో వేసిన అక్రమ లేఅవుట్‌ మా దృష్టికి వచ్చింది. దీనిపైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం.

అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకుంటాం

- పంచాయతీ కార్యదర్శి, ఆశాకిరణ్‌

సున్నపుగుట్టండాలో వెలసిన అక్రమ లేఅవుట్‌పై చర్యలు తీసుకుంటాం. సిబ్బంది అంతా సత్యసాయిబాబా జయంతి పనుల్లో ఉండడం వల్ల చర్యలు ఆలస్యమవుతున్నాయి.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 16 , 2025 | 12:31 AM