Share News

WIRES: ఇలా ఉంటే ఎలా?

ABN , Publish Date - Nov 16 , 2025 | 12:57 AM

మండల పరిధిలోని గౌళ్లపల్లికి విద్యుత అధికారులు ఎన్నో యేళ్లక్రితమే విద్యుత సౌకర్యం క ల్పించారు. గ్రామంలోకి మూడు వైర్లుతో విద్యుత సరఫరా అందిస్తున్నారు. అయితే గ్రామం సమీపంలో ఆ మూడు విద్యుత వైర్లకు ప చ్చని తీగలు పూర్తిగా అల్లుకుపోయాయి. వైర్ల మొత్తం కిందికి లా గేస్తున్నాయి. అయినా విద్యుత అధికారులు ఆ వైపు కన్నెతి చూసిన పాపాన పోలేదు.

WIRES: ఇలా ఉంటే ఎలా?
Green wires attached to electrical wires

తనకల్లు, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని గౌళ్లపల్లికి విద్యుత అధికారులు ఎన్నో యేళ్లక్రితమే విద్యుత సౌకర్యం క ల్పించారు. గ్రామంలోకి మూడు వైర్లుతో విద్యుత సరఫరా అందిస్తున్నారు. అయితే గ్రామం సమీపంలో ఆ మూడు విద్యుత వైర్లకు ప చ్చని తీగలు పూర్తిగా అల్లుకుపోయాయి. వైర్ల మొత్తం కిందికి లా గేస్తున్నాయి. అయినా విద్యుత అధికారులు ఆ వైపు కన్నెతి చూసిన పాపాన పోలేదు. దీంతో అటువైపు వెళ్లే గ్రామస్థుల దీనిని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైర్లు ఎక్కడ జాయింట్‌ అయి విద్యుత ప్రమాదాలు ఏర్పడతాయో అని భయాందోళన చెం దుతున్నారు. ఇప్పటికైనా విద్యుత అధికారులు గ్రామాన్ని సందర్శించి ఆ విద్యుత వైర్లకు అల్లుకున్న తీగలను తొలగించాలని, విద్యుత ప్రమాదాలు జరగకుండా నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Nov 16 , 2025 | 12:57 AM