Share News

MLA: పేదల వైద్యానికి పెద్ద పీట

ABN , Publish Date - Nov 13 , 2025 | 11:34 PM

పేదల వైద్యానికి కూటమి ప్రభు త్వం పెద్ద పీట వేసిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నా రు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లాలో గురువారం రూ.46లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదల వైద్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునా యుడు పెద్ద పీట వేస్తున్నారన్నారు.

MLA: పేదల వైద్యానికి పెద్ద పీట
MLA Kandikunta distributing CM's relief fund cheques

- మెడికల్‌ కాలేజీల విషయంలో ఫోజులిస్తున్న వైసీపీ నాయకులు

- ఎమ్మెల్యే కందికుంట

కదిరి, నవంబరు13 (ఆంధ్రజ్యోతి): పేదల వైద్యానికి కూటమి ప్రభు త్వం పెద్ద పీట వేసిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నా రు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లాలో గురువారం రూ.46లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదల వైద్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునా యుడు పెద్ద పీట వేస్తున్నారన్నారు. గురువారం 41మంది లబ్ధిదారులకు రూ.46లక్షల చెక్కులను అందచేసినట్లు తెలిపారు. గడిచిన 15నెలలో రూ.2,25లక్షల వరకు పేదల వైద్యానికి ఖర్చు చేశామన్నా రు. మెడికల్‌ కాలేజీల కోసం పోరాడుతున్నట్లు వైసీపీ నాయకులు కేవ లం ఫోజులిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు వైద్యం కోసం గొప్పగా ఆ లోచించే వ్యక్తి సీఎం చంద్రబాబే అన్నారు.


పీపీపీ విధానం ద్వారా మె డికల్‌ సీట్లు పెరుగుతాయన్నారు. వైసీపీ నాయకులు తమ ఉనికి కోసం మందు, బిర్యానీలు పంచి జనాలను తీసుకొస్తున్నారని, కానీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ప్రజలు వారి తరఫున రావడంలేదన్నారు. గడిచిన 15నెలల కాలంలో ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చామన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్‌ ఒక్కసారి ఆర్టీసీ బస్సుఎక్కితే ప్రయాణం ఉచితమో కాదో తెలుస్తుందన్నారు. వైసీపీ వారు చేసిన అకృత్యాలను ఇంకా ప్రజలు మరి చిపోలేదన్నారు. పీపీకిట్లు అడిగిన డాక్టర్లను పిచ్చోళ్లను చేసిన చరిత్ర, కరోనా సమయంలో ఉపాధ్యాయులను మద్యం షాపులో నిలపెట్టిన ఘన త వారికే దక్కుతుందన్నారు. అక్రమ మద్యం వ్యాపారంతో ప్రజల జీవితా లతో ఆడుకున్నారన్నారు. వారి తప్పులను ప్రశ్నించిన వారు శవాలుగా మారలేదా అన్నారు. వారు చేసిన తప్పులకు ప్రజలు 151నుంచి 11సీట్లకు పరిమితం చేసినా బుద్ధిలేకుండా ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని ఎద్దే వా చేశారు. చౌకబారు విమర్శలు మాని ప్రజాహితంకోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 13 , 2025 | 11:34 PM