• Home » Jagtial

Jagtial

ముఖ గుర్తింపుతో  పెరిగిన హాజరు శాతం

ముఖ గుర్తింపుతో పెరిగిన హాజరు శాతం

peddapalli ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంపుతోపాటు భవిష్యత్‌లో ప్రవేశాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో వలే జూనియర్‌ కళాశాలల్లోనూ ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని అమల్లోకి తీసుక వచ్చింది.

ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడంలో మంత్రి విఫలం

ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడంలో మంత్రి విఫలం

మంథని నియోజకవర్గంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించడంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు 22 ఇండ్లు కూడా పూర్తి చేయించ లేకపోయారని విమర్శించారు.

నగరంలో ట్రా‘ఫికర్‌’

నగరంలో ట్రా‘ఫికర్‌’

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వాహనాల రద్దీరోజురోజుకు పెరుగుతోంది. నగరం స్మార్ట్‌సిటీ కావడమేకాకుండా శివారులోని పద్మనగర్‌, చింతకుంట, మల్కాపూర్‌, రేకుర్తి, సీతారాంపూర్‌, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్‌, గోపాల్‌పూర్‌, దుర్శేడ్‌, బొమ్మకల్‌, సదాశివపల్లి, అల్గునూర్‌తోపాటు కొత్తపల్లి మున్సిపాలిటీ నగరపాలక సంస్థలో విలీనమయ్యాయి.

సాదా బైనామాలపై ఆశలు

సాదా బైనామాలపై ఆశలు

సాధారణ పేపర్లపై రాసుకొని భూములు కొనుగోలు చేసిన వారికి హక్కులు లభించనున్నాయి. భూ భారతి చట్టం ద్వారా క్రమబద్ధీకరించేందుకు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆయా భూములపై హక్కులు దక్కనున్నాయి.

యథేచ్ఛగా చిట్‌ఫండ్స్‌ మోసాలు

యథేచ్ఛగా చిట్‌ఫండ్స్‌ మోసాలు

జిల్లాలో చిట్‌ఫండ్స్‌ అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జీరో చిట్స్‌ దందాను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సిన చిట్‌ రిజిస్ట్రార్‌ శాఖ పట్టించుకోకపోవడంతో చిట్‌ సభ్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారనే విమర్శేలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య, మద్యతరగతికి చెందినవారు నెలనెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసి చిట్స్‌ వేస్తుంటారు.

గంగమ్మ ఒడికి గణపయ్య...

గంగమ్మ ఒడికి గణపయ్య...

జై బోలో గణేష్‌ మహారాజ్‌కీ జై ...గణపయ్యా.. వెళ్లి రావయ్యా అంటూ భక్తులు గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు చేసిన భక్తులు వినాయక నిమజ్జన వేడుకలను రెండో రోజు శనివారం ఘనంగా జరుపుకున్నారు.

చెరువులకు జల కళ..

చెరువులకు జల కళ..

జిల్లాలో గడిచిన నెలలో వర్షాలు విస్తారంగా కురవడంతో చెరువులకు జల కళ సంతరించుకుంది. ఆగస్టులో 34 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్‌, జూలై నెలల్లో లోటు వర్షపాతం నమోదైన విషయం విదితమే. జిల్లా వార్షిక వర్షపాతం ఆగస్టు వరకు 238.7 మిల్లీమీటర్లు కాగా 319.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

నేడు కాంగ్రెస్‌ జనహిత పాదయాత్ర

నేడు కాంగ్రెస్‌ జనహిత పాదయాత్ర

కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన జనహిత పాదయాత్ర ఆదివారం జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో జరగనున్నది. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ చేస్తున్న ఈ పాదయాత్రకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

జోరుగా ఉపాధిహామీ పనుల జాతర

జోరుగా ఉపాధిహామీ పనుల జాతర

జిల్లాలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధిహామీ పనుల జాతర-2025 కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలులో భాగంగా పల్లెల్లో నివసిస్తున్న నిరుపేద కూలీల జీవనోపాధి మెరుగుపరచడానికి, ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల పని కల్పించడానికి వివిధ రకాల పనులు చేపట్టారు.

బోధనకు సమయమేదీ

బోధనకు సమయమేదీ

ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు బోధనేతర పనులతో సమయం గడిచిపోతోంది. ఒకప్పుడు పాఠ్యాంశాలు బోధిస్తూ తీరిక లేకుండా గడిపే ఉపాధ్యాయులు నేడు యాప్‌, ఆన్‌లైన్‌ పనులతో కుస్తీ పడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరవుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి