Home » Ishan Kishan
రాయ్‌పుర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. 37 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. 468 రోజులు, 24 ఇన్నింగ్స్ తర్వాత సూర్య హాఫ్ సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలో సూర్య చక్కగా బ్యాటింగ్ చేశాడని టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కొనియాడాడు.
న్యూజిలాండ్‌తో రాయ్‌పుర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 209 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 15.2 ఓవర్లలోనే ఆటను ముగించింది. ఈ నేపథ్యంలో టీమిండియా పలు రికార్డులను నమోదు చేసింది.
రాయ్‌పుర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 76 పరుగులతో చెలరేగి ఆడాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్‌పై ఇషాన్ మాట్లాడాడు. తన ప్రశ్నలన్నింటికీ సమాధానం పరుగులే అని చెప్పాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్.. న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
భారత్-న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఓ బ్యాడ్ న్యూస్ అందుతోంది. టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ ఈ వన్డే సిరీస్‌కు దూరమైనట్టు తెలుస్తోంది. శనివారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి తగలడంతో ఆయనకు బలమైన గాయమైంది. దీంతో ఆయన్ను తప్పించినట్టు సమాచారం.
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. జనవరి 11నుంచి టీమిండియాతో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే ఇందులో స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.
టీమిండియా స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ దేశవాళీల్లో అదరగొడుతున్న విషయం తెలిసిందే. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున సెంచరీ బాది తొలి సారి టైటిల్ అందించాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ మెరుపు శతకం బాదాడు. ఈ సందర్భంగా అతడి ఫామ్‌పై దిగ్గజ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు.
భారత జట్టు న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి 18 వరకు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్‌పై వేటు పడే అవకాశముంది. దేశవాళీల్లో అదరగొడుతున్న సంచలన బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌కు నాయకత్వం వహిస్తున్న ఇషాన్ కిషన్.. 33 బంతుల్లో సెంచరీ చేశాడు. కాసేపటి క్రితమే బిహార్ తరఫున వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో శతకం బాదాడు. తాజాగా ఇషాన్ కిషన్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి భారత జట్టును సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. టీమిండియాలోకి ఇషాన్ రీఎంట్రీపై భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ స్పందించాడు.