Home » IPL
క్రికెట్ ప్రపంచాన్నే శాసించిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చాడని అందరూ అనుకుంటుంటారు. కానీ కోహ్లీ ఐపీఎల్ కంటే ముందే టీ20 క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ చేయనున్నారనే ప్రచారం ఊపందుకున్న వేళ.. ఆ వార్తలకు ఎంఐ ఫ్రాంచైజీ చెక్ పెట్టింది. హార్దిక్ విషయంలో సీఎస్కేతో గానీ, మరే ఇతర ఫ్రాంచైజీలతో గానీ ఎలాంటి చర్చలు జరపడం లేదని ఎంఐ ప్రతినిధి స్పష్టం చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అరుదైన ఘనత సాధించింది. 300 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువ దాటిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా నిలిచింది.
భారత మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ ఆటగాడిగా క్రికెట్‌కు దూరమైనా.. బౌలింగ్‌పై అతడికున్న ప్రేమ మాత్రం తగ్గలేదు. తాజాగా యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో గ్లాస్గో కాస్మిక్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీతో హ్యాండ్‌షేక్ వివాదంపై ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ ఎట్టకేలకు స్పందించాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని హెడ్ స్పష్టం చేశాడు.
భారత స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ విషయంపై సంజు స్పందించాడు.
ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ భారత్‌కు తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు. 2009 నాటి ఐపీఎల్ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం కేసులో లలిత్ మోదీకి అప్పిలేట్ ట్రైబ్యూనల్ అనుకూలంగా తీర్చునిచ్చింది.
సీఎస్కే తదుపరి హెడ్ కోచ్ కోసం ఫ్రాంచైజీ అన్వేషణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా ఉన్న హేమంగ్ బదానిని ప్రధాన కోచ్‌గా నియమించుకునేందుకు సీఎస్కే ఫ్రాంచైజీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని సీఎస్కే ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది. దీంతో సీఎస్కేతో ఉన్న 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి తెరపడింది.
టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో పలు కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. కోచింగ్ స్టాఫ్‌లోని ఓ కీలక సభ్యుడు తన పదవికి వీడ్కోలు పలికి.. ఐపీఎల్‌లోని ఓ ఫ్రాంచైజీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సదరు ఫ్రాంచైజీతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.