Share News

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!

ABN , Publish Date - Jun 18 , 2026 | 02:32 PM

ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ కీలక అప్‌డేట్ అందించింది. 2027లో జరగబోయే 20వ ఐపీఎల్ ఎడిషన్ షెడ్యూల్‌లో బీసీసీఐ భారీ మార్పులు చేయనుంది.

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!
IPL 2027 schedule

స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక అప్‌డేట్ అందించింది. 2027లో జరగబోయే 20వ ఐపీఎల్ ఎడిషన్ షెడ్యూల్‌లో బీసీసీఐ భారీ మార్పులు చేయనుంది. సాధారణంగా మార్చి చివరి వారంలో ప్రారంభమై, మే ఆఖరి వరకు సాగే ఈ టోర్నీని వచ్చే ఏడాది రెండు వారాల ముందే ప్రారంభించనున్నారు.


ఐపీఎల్ 2027 సీజన్‌ను మార్చి 10 నుంచి మే 15 వరకు నిర్వహించేలా కొత్త విండోను ఖరారు చేసినట్లు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా గురువారం వెల్లడించారు. మే నెల చివరి వారాల్లో దేశంలో నమోదవుతున్న విపరీతమైన ఎండల తీవ్రత, కొన్ని ప్రాంతాల్లో ముందస్తు రుతుపవనాల ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ 2026 సీజన్ మే 31 వరకు కొనసాగడం వల్ల ఆటగాళ్లు, మైదానానికి వచ్చే అభిమానులు తీవ్రమైన ఉక్కపోత, ఎండలతో ఇబ్బంది పడ్డారని వెల్లడించారు.


ప్రేక్షకుల సౌకర్యార్థమే టోర్నీని రెండు వారాలు ముందుకు జరుపుతున్నామని తెలిపారు. ఇదే సమయంలో ఐపీఎల్‌లో మ్యాచ్‌ల సంఖ్య పెరగవచ్చనే ఊహాగానాలకు సైకియా తెరదించారు. అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్, ఇతర దేశాల ద్వైపాక్షిక సిరీస్‌లను దృష్టిలో ఉంచుకుని మ్యాచ్‌ల సంఖ్యను 74 నుంచి 94కు పెంచే ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కనబెట్టామన్నారు. వచ్చే సీజన్‌లో కూడా పాత పద్ధతిలోనే 74 మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేశారు.


ఇది కూడా చదవండి:

ఉజ్బెకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన కొలంబియా

జులన్‌ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ

Updated Date - Jun 18 , 2026 | 02:57 PM