Share News

విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్‌పై ఆర్సీబీ సీఈవో కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 19 , 2026 | 02:32 PM

ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో విరాట్ కోహ్లీకి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఒకే ఫ్రాంచైజీ తరఫున టోర్నమెంట్ మొత్తం 19 సీజన్లలో ఆడిన ఏకైక ఆటగాడిగా ఈ బ్యాటింగ్ దిగ్గజం నిలిచాడు.

విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్‌పై ఆర్సీబీ సీఈవో  కీలక వ్యాఖ్యలు
Virat Kohli IPL retirement

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో విరాట్ కోహ్లీకి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఒకే ఫ్రాంచైజీ తరఫున టోర్నమెంట్ మొత్తం 19 సీజన్లలో ఆడిన ఏకైక ఆటగాడిగా ఈ బ్యాటింగ్ దిగ్గజం నిలిచాడు. ఆర్సీబీని రెండుసార్లు విజేతగా నిలవడంలో అతడిదే కీలక పాత్ర. తాను జట్లు మారే ప్రణాళికలు లేవని, తన ఐపీఎల్ కెరీర్‌ను ఆర్సీబీతోనే ముగించాలనుకుంటున్నానని కోహ్లీ పలు సందర్భాల్లో స్పష్టం చేశాడు. మరోవైపు ఐపీఎల్ 2027 సీజన్‌ అనంతరం ఈ క్యాచ్ రిచెస్ట్ లీగ్‌కు వీడ్కోలు పలుకుతాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో విరాట్ రిటైర్‌మెంట్‌పై ఆర్సీబీ సీఈవో రాజేష్ మేనన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.


ఓ జాతీయ మీడియాతో రాజేష్ మేనన్ మాట్లాడుతూ... 'ఆర్సీబీ, కోహ్లీ ఒకే నాణేనికి రెండు ముఖాల్లాంటి వారు. అతడికి రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఒకవేళ కోహ్లీ క్రికెట్‌కు దూరమైనా సరే.. ఆర్సీబీలో భాగం కాకుండా ఉండటాన్ని మేం ఊహించలేం. దీనికి తప్పకుండా పరిష్కారాన్ని ఆలోచన చేస్తాం. ఇప్పటికప్పుడు విరాట్ ఐపీఎల్‌ను వదిలిపెట్టడు. కోహ్లీ తన కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ, అతని ఫిట్‌నెస్, పట్టుదల ప్రభావంతో కనీసం మూడు లేదా నాలుగేళ్లు ఆడతాడు. ఇప్పటికీ పరుగుల దాహం తీరలేదు. ఇటీవల సీజన్‌లో కోహ్లీని చూస్తేఈ విషయం అర్థమవుతుంది’ అని రాజేష్ పేర్కొన్నారు.


ఐపీఎల్ 2026లో కోహ్లీ ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతడు 165.84 స్ట్రైక్ రేట్‌తో 675 పరుగులు సాధించాడు. ఇది ఒకే సీజన్‌లో అతడి అత్యుత్తమ స్ట్రైక్ రేట్. ఇక ఫైనల్‌ మ్యాచ్ లో అజేయంగా 75 పరుగులు చేసి.. ఆర్సీబీకి వరుసగా రెండు టైటిళ్లను గెలుచుకుని చరిత్ర సృష్టించడంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు.


ఇవి కూడా చదవండి:

వైభవ్ రాణిస్తే టెస్ట్ క్రికెట్‌కు పునరుజ్జీవనం

అఫ్గాన్‌తో చివరి వన్డే.. అనూహ్యంగా భారత జట్టులో కొత్త ప్లేయర్

Updated Date - Jun 19 , 2026 | 03:44 PM