విద్యాసంస్థల్లో ర్యాంక్స్ ఇంపార్టెంట్ కాదు.. సేఫ్ ఎన్విరాన్మెంట్ ముఖ్యం: సీపీ సజ్జనార్
ABN , Publish Date - Jun 19 , 2026 | 01:48 PM
విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పాటించడం అన్నది అలవాటుగా మారాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. ఇటీవల కాలంలో పిల్లలు క్రైమ్‌లో ఇన్వాల్వ్ అవుతున్నారని... ఇది బాధ కలిగించే విషయమని తెలిపారు.
హైదరాబాద్, జూన్ 19: మైనర్లు డ్రైవింగ్ చేస్తే అస్సలు క్షమించమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం) హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ‘స్కూల్ పిల్లల భద్రత’పై స్కూల్ యాజమాన్యాలు, సంబంధిత శాఖలతో ట్రాఫిక్ పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సిటీ పరిధిలో 3500లకు పైగా స్కూల్స్ ఉన్నాయని, వీటిలో 12 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. సేఫ్ స్కూల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పాటించడం అన్నది అలవాటుగా మారాలని సూచించారు.
విద్యాసంస్థల్లో ర్యాంక్స్ ఇంపార్టెంట్ కాదని.. సేఫ్ ఎన్విరాన్మెంట్ ముఖ్యమని సీపీ స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో స్కూల్ బస్సు డ్రైవర్లు పట్టుబడుతున్నారని తెలిపారు. విద్యార్థులు స్కూల్‌కు ఏ విధంగా వస్తున్నారనే దానిపై స్కూల్ యాజమాన్యం వద్ద పూర్తి రూట్‌మ్యాప్ ఉండాలన్నారు. పిల్లలు పాఠశాలకు వస్తున్నారంటే.. ఏం జరిగినా స్కూల్ యాజమాన్యానిదే బాధ్యత అని తేల్చిచెప్పారు.
స్కూల్ బస్సులను నడిపే డ్రైవర్స్‌పై నిఘా ఉంచాలని సీపీ సూచించారు. ట్రాఫిక్ వాలంటీర్లు, మార్షల్స్‌ను విద్యాసంస్థలు నియమించుకోవాలని అన్నారు. పిల్లలు తెలిసీ తెలియక నేరాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారని.. పిల్లలపై టీచర్స్, పేరెంట్స్ పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. స్కూల్ పరిసరాల్లో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. స్కూల్ పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులు అమ్మడం నేరమని... అలాంటి వాటిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు 45 మంది విద్యార్థులు యాక్సిడెంట్లో చనిపోతున్నారని, యాక్సిడెంట్లు మర్డర్ల కంటే ప్రమాదకరమన్నారు. అందుకే స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించాలని సీపీ సజ్జనార్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి
వాన్‌పిక్ ఆస్తుల వ్యవహారం.. హైకోర్టులో ఈడీ పిటిషన్ డిస్మిస్
Read Latest Telangana News And Telugu News