Share News

హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి

ABN , Publish Date - Jun 19 , 2026 | 11:36 AM

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. హోటల్స్, రెస్టారెంట్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 45 ప్రముఖ ఫుడ్ లే అవుట్లు, 8 పన్నీర్ తయారీ కేంద్రాలపై దాడులు చేశారు.

హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి
Food Safety Raids

హైదరాబాద్, జూన్ 19: నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. హోటల్స్, రెస్టారెంట్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 45 ప్రముఖ ఫుడ్ లే అవుట్లు, 8 పన్నీర్ తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. మరో రెండు రోజులపాటు ఫుడ్ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు కొనసాగనున్నాయి. ఈ దాడుల్లో రెస్టారెంట్లు, హోటల్స్ కిచెన్స్‌లో అధ్వానమైన పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జూబ్లీహిల్స్, మాదాపూర్‌లోని ప్రముఖ రెస్టారెంట్లలో రోజుల తరబడి కుళ్లిన చికెన్, పన్నీర్ ఉన్నట్లు సోదాల్లో బయటపడింది. దీంతో దాదాపు 20 రెస్టారెంట్లకు అధికారులు పెనాల్టీలు, నోటీసులు జారీ చేశారు.


బేగంబజార్, కాటేదాన్ ప్రాంతాల్లో పన్నీర్ తయారీ కేంద్రాలపై దాడులు చేయగా.. అక్కడి వాతావరణం చూసి అధికారులే షాక్‌కు గురయ్యారు. గంజి పొడి, జంతువుల కొవ్వు ఉపయోగించి పన్నీర్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్ అధికారుల నేతృత్వంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.


ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లపై..

పాతబస్తీలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లపై హెచ్ ఫాస్ట్ దాడులు నిర్వహించింది. వాడిన ఆయిల్‌ను పదేపదే వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అత్యంత ప్రమాదకర రసాయనాలతో సాస్ తయారుచేసి విక్రయాలు జరుపుతున్నట్లు తేలింది. కుళ్లిన కూరగాయలతో సమోసాలు, ప్రమాదకర స్థితిలో ఫ్రైడ్ చికెన్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఫాస్ట్‌ఫుడ్ తయారీ గోదామును పోలీసులు మూసివేశారు.


ఇవి కూడా చదవండి...

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకు సహా ముగ్గురి మృతి

శరీరాకృతి కోసం స్టెరాయిడ్ల వినియోగం.. జిమ్‌లలో పోలీసుల ముమ్మర తనిఖీలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 12:04 PM