Share News

‘ఇండస్ట్రియల్ హబ్‌గా ఏపీ’.. పారిశ్రామికవేత్తలకు లోకేశ్ ఆహ్వానం

ABN , Publish Date - Jun 19 , 2026 | 10:56 AM

కోల్‌కతాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని కోరారు.

‘ఇండస్ట్రియల్ హబ్‌గా ఏపీ’.. పారిశ్రామికవేత్తలకు లోకేశ్ ఆహ్వానం
Minister Nara Lokesh

కోల్‌కతా/అమరావతి, జూన్ 19: కోల్‌కతాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు(శుక్రవారం) ఉదయం ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని కోరారు. వీసా స్టీల్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరక్టర్ ఆదిత్య ఆగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూర్‌లతో లోకేశ్ భేటీ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, విధానాలను ప్రశంసించారు.


lokesh-kol.jpg

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనకు వ్యూహాత్మకంగా సంస్కరణలను అమలుచేస్తున్న తీరును లోకేశ్ వివరించారు. భారతదేశంలో ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యంగా చెప్పారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడులలో ఒకటైన 'ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్' (ArcelorMittal Nippon Steel) ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులు ఇప్పటికే అనకాపల్లి సమీపంలో ప్రారంభమయ్యాయని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

lokesh-kol3.jpg


ఇవి కూడా చదవండి...

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకు సహా ముగ్గురి మృతి

శరీరాకృతి కోసం స్టెరాయిడ్ల వినియోగం.. జిమ్‌లలో పోలీసుల ముమ్మర తనిఖీలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 11:55 AM