Share News

ప్రకాశం జిల్లాలో విషాదం.. ముగ్గురు కూతుళ్లకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య

ABN , Publish Date - Jun 19 , 2026 | 08:57 AM

ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ముగ్గురు కూతుళ్లకు విషమిచ్చి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

ప్రకాశం జిల్లాలో విషాదం.. ముగ్గురు కూతుళ్లకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య

ప్రకాశం, జూన్ 19: జిల్లాలోని చీమకుర్తి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కన్నబిడ్డలకు రక్షణగా నిలవాల్సిన తండ్రే తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి చంపి, ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చీమకుర్తి మండలం అగ్రహారం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


పోలీసుల కథనం ప్రకారం.. అగ్రహారం గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తికి, అతడి భార్యకు మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తనను వదిలి వెళ్లిపోవడంతో భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో తన ముగ్గురు కూతుళ్లు.. గోచిత(13), పూజిత(11), లోకిత శ్రీ ( 8) కి బలవంతంగా విషం తినిపించి, తర్వాత తానూ విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీకాకుళం.. పలాస‌లో దారుణం ..

శ్రీకాకుళం జిల్లా పలాసలో గుండెలవిసే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పలాస రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఓ మహిళ, ఆమెతో పాటు ఉన్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

బీచ్‌ ఒడ్డున జాగ్రత్తగా ఉండకపోతే ఇంతే.. ప్రమాదం ఎలా ముంచుకొచ్చిందో చూడండి..

బామ్మ నిర్లక్ష్యం.. సైక్లిస్టుల ప్రాణాల మీదకు వచ్చిందిగా... వీడియో వైరల్

Updated Date - Jun 19 , 2026 | 09:36 AM